pizza
Abbas (Cricketer Azharuddin's son) debut film as hero titled 'Iddariki Kothaga'
అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ హీరోగా కె.సురేష్‌బాబు దర్శకత్వంలో 'ఇద్దరికీ కొత్తేగా'
You are at idlebrain.com > news today >
Follow Us

08 April 2016
Hyderaba
d

అంతర్జాతీయ క్రికెట్‌ క్రీడాకారుడు, మాజీ ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. శ్రీ శివపార్వతి కంబైన్స్‌ పతాకంపై 'నాకూ ఓ లవరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన కె.సురేష్‌బాబు కన్నడలో 'షేకింగ్‌ హ్యాండ్స్‌' పేరుతో ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీని నిర్మించారు. డిఫరెంట్‌ మూవీస్‌ని నిర్మిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న కె.సురేష్‌బాబు ఇప్పుడు దర్శకుడుగా మారుతున్నారు. అజహరుద్దీన్‌ కుమారుడు అబ్బాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'ఇద్దరికీ కొత్తేగా' పేరుతో ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నారు కె.సురేష్‌బాబు. ఈ చిత్రంలో అబ్బాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా జరగనుందని కె.సురేష్‌బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి మహమ్మద్‌ అజహరుద్దీన్‌తోపాటు బాలీవుడ్‌, టాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని, తన డైరెక్షన్‌లో రూపొందనున్న 'ఇద్దరికీ కొత్తేగా' చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తానని కె.సురేష్‌బాబు తెలిపారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved