pizza
Allu Sirish’s latest ‘ABCD’ (Americal Born Confused Desi) will hit the screens on February 8th in 2019
చివరి షెడ్యూల్ లో అల్లు శిరీష్ "ఏబీసీడీ" చిత్రం..... ఫిబ్రవరి 8న గ్రాండ్ రిలీజ్
You are at idlebrain.com > news today >
Follow Us

3 November 2018
Hyderabad

Ruksar Thillan, Krishnarjuna Yuddam fame will romance with Allu Sirish in his next project ABCD. Child artist Bharath Reddy will be seen as the hero’s friend. Sanjeev Reddy debuting as a director with this film. This romantic comedy entertainer will be produced on Madhura Entertainments Banner. Madhura Sridhar Reddy along with BigBen cinemas Banner’s Yash Rangineni combinedly bankrolling this crazy project and Dheeraj Mogilineni is co-producer for this film.

Kannada’s top music director Jodha Sandhi will give music for the movie and Son of Sirivennela Seetharamasasthri Raja, Kota Srinivasa Rao and Subhaleka Sudhakar are some of the cast members in the film.

The production team planned a final schedule in India. Entire shooting part will be completed by December 15th and makers are planning to release the film on February 8th of next year worldwide.

While addressing a press conference, producers told that this is a remake of super hit Malayali movie “ABCD” and they are very happy to bring that entertainer to Telugu Film Industry with Allu Sirish. Allu Sirish will play what Dhulkar had played in the original version.

Cast: Allu Sirish, Ruksar Thillan, Bharath, Raja, Kota Srinivasra Rao, Shubaleka Sudhakar and others.

Music: Judha Sandhi

Co-Producer: Dheeraj Mogilineni

Banners: Madhura Entertainments, BigBen Cinemas

PRO: Eluru Srinu

Producers: Madhura Sridhar Reddy, Yash Rangineni

Director: Sanjeev Reddy

చివరి షెడ్యూల్ లో అల్లు శిరీష్ "ఏబీసీడీ" చిత్రం..... ఫిబ్రవరి 8న గ్రాండ్ రిలీజ్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి , బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేక సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియాలో చివరి షెడ్యూల్ చేసేందుకు ప్లాన్ చేశారు. అమెరికాలో జరిగే షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 15 నాటికి షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా....

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ, కథనం, మాటలు ఉంటాయి. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా, కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. ఇండియాలో చివరి షెడ్యూల్ ప్లాన్ చేశాం. అమెరికాలో జరిగే షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. డిసెంబర్ 15 నాటికి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే ఈ చిత్రాన్ని 2019 ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్, రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేఖ సుధాకర్ తదితరులు

సాంకేతిక వర్గం
మ్యూజిక్ డైరెక్టర్ - జుధా సాంధీ
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
బ్యానర్స్ - మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
నిర్మాతలు - మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
దర్శకుడు - సంజీవ్ రెడ్డి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved