pizza
First Look of Vijay's 'Adhirindhi' gets a thumping response
విజయ్ అదిరింది ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్… తెన్నాండల్ స్టూడియోస్, శరత్ మరార్ సంయుక్తంగా తెలుగులో విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

26 June 2017
Hyderabad

The first look of Vijay 61, which has been titled as 'Adhirindhi' in Telugu, has got a thumping response from the audience and industry alike. Murali Ramasamy & Hema Rukmani of Thenandal Studios Ltd take pride in bringing this prestigious and much-awaited film to Telugu audiences. Rama Narayanan had directed Sravana sukravaaram, Naggama, Lakshmi Durga, Nagabaala, Bombbat car.
Adirindhi is the 100th film under the Thenandal banner, a mega budget film made in both Tamil and Telugu.

Talking about the film, Murali Ramasamy said, "Thenandal Studios Ltd will release the film in Telugu through Northstar Entertainment's Sharrath Marar, who is the strategical partner of the film. We are pleased that Sharrath Marar has joined hands with us to release the film in a big way and we are confident that this collaboration will be fruitful in every sense."

In past, Sharrath Marar had produced films like Katamarayudu and Sardar Gabbar Singh, and he has a vast experience in TV industry as well. "I am proud to be associated with Thenandal Studios Ltd to bring Vijay's Adhirindhi to Telugu audiences. Moreover, 'Adhirindhi' is the 100th film to be produced by Thenandal films and I'm sure that it will be a landmark film for all the actors and other stakeholders," Sharrath Marar said.

This blockbuster is an ensemble of top stars and technicians. The film is written & directed by Atlee who has stuck the right chord with the box office in his first two movies with music being composed by Shri A R Rahman. Vijay and Atlee’s earlier combination created magic through Theri, which was dubbed in Telugu as 'Police'. The expectations this time from this dream pair are far higher.

With the blessing of Ramanarayanan, Thenandal Studios Limited's 100th production has a huge star cast led by Ilayathalapathy Vijay, along with S.J.Surya, Kajal Aggarwal, Samantha, Nithya Menen, Vadivel, Kovai Sarala, Sathyan, and Sathyaraj.

The film has been extensively shot in several parts across India. Moreover, some of the important sequences of the film have been filmed in Europe. The film's audio will be launched in a grand way in August and the preparation for this event are already under progress. Vivek has written the lyrics. G.K.Vishnu is the cinematographer, Ruban is the editor and Anal Arasu has composed the action sequences.

The film's screenplay has been written by Vijayendra Prasad and Ramana Girivasan. After the stupendous success of Bhaahubali : The Beginning, Bhajrangi Bhaijaan and Baabubali : The Conclusion, Vijayendra Prasad is one of the most sought after writers in the country and he has written the story of Adiindhi. Shobi has choreographed the dance.

Story, Screenplay, Dialogue and Direction by Atlee and the film is slated for worldwide release in October.

విజయ్ అదిరింది ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్… తెన్నాండల్ స్టూడియోస్, శరత్ మరార్ సంయుక్తంగా తెలుగులో విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అదిరింది అనే టైటిల్ విజయ్ కు సరిగ్గా సరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ అభిమానులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాలు అదిరింది టైటిల్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

మురళీ రామస్వామి మాట్లాడుతూ… నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్ తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించనున్నాం. శరత్ మరార్ గారు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ చిత్రాలు నిర్మించిన శరత్ మరార్ గారికి టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరుంది. ఆయనతో అసోసియేట్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అని అన్నారు.

శరత్ మరార్ మాట్లాడుతూ… విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ వందో చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. విజయ్ కు తెన్నాండల్ స్టూడియోస్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. అని అన్నారు.

ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది. ఆగస్ట్ లో ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మొదలు పెట్టారు. అక్టోబర్ లో ఈచిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు - విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్

సాంకేతిక నిపుణులు
సంగీతం - ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం - వివేక్
సినిమాటోగ్రాఫర్ - జి.కె.విష్ణు
ఎడిటర్ - రుబన్
యాక్షన్ - అనల్ అరసు
కొరియోగ్రఫి - శోభి
స్టోరీ - విజయేంద్రప్రసాద్
స్క్రీన్ ప్లే - విజయేంద్ర ప్రసాద్, రమణ గిరివాసన్
నిర్మాతలు - మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - అట్లీ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved