pizza
Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent First Look Revealed
ఆక‌ట్టుకుంటున్నఅఖిల్ అక్కినేని, సురేంద‌ర్ రెడ్డి, అనిల్ సుంక‌ర ప్ర‌స్టీజియ‌స్ మూవీ `ఏజెంట్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌. ‌
You are at idlebrain.com > news today >
 
Follow Us

8 April -2021
Hyderabad

Young hero Akhil Akkineni who is opting for distinctive scripts for his films will next be joining hands with star director Surender Reddy whose last film Sye Raa Narasimha Reddy was a smashing hit.

Specialist in presenting his heroes at stylish best, Surender Reddy will show a new version of Akhil in the first film in their combination.

Vakkantham Vamsi is providing story for the film to be produced by Ramabrahmam Sunkara under Anil Sunkara’s AK Entertainments and Surender 2 Cinema.

The director-writer duo previously worked together for few blockbusters such as Kick, Race Gurram and they are on a mission to deliver another super hit in their combination.

Akhil 5 is titled as Agent and on the occasion of the actor’s birthday, first look poster of the film is revealed.

Akhil who underwent a complete makeover for Agent looks dashing in the first look poster with beard and stylish hairdo. Smoking a cigarette, Akhil has got his body language and attitude right.

Akhil has transformed himself from a lover boy to a macho man. Credit goes to Surender Reddy who will be showing Akhil in a never-seen-before stylish avatar in the film.

There is Surender Reddy’s mark in title design as well. Overall, Agent first-look is intriguing.

This is already turning out to be a crazy project, given Akhil is a promising star, Surender Reddy is an accomplished director, Vakkantham Vamsi is a proficient writer and AK Entertainments is a successful banner.

A newbie Sakshi Vaidya is roped in to play the leading lady opposite Akhil in the film billed to be a spy thriller.

Tollywood’s busiest music director SS Thaman will be scoring music, while Ragul Herian Dharuman will crank the camera. National Award winner Naveen Nooli is the editor while Avinash Kolla is the art director.

Ajay Sunkara, Pathi Deepa Reddy are the co-producers of the film.

Agent’s regular shoot commences from 11th of this month. The makers have also announced to release Agent on 24th December, 2021.

Cast: Akhil Akkineni, Sakshi Vaidya
Director: Surender Reddy
Producer: Ramabrahmam Sunkara
Co-Producers: Ajay Sunkara, Pathi Deepa Reddy
Executive Producer: Kishore Garikipati
Banners: AK Entertainments, Surender 2 Cinema
Story: Vakkantham Vamsi
Music Director: SS Thaman
DOP: Ragul Herian Dharuman
Editor: Naveen Nooli
Art Director: Avinash Kolla.

ఆక‌ట్టుకుంటున్నఅఖిల్ అక్కినేని, సురేంద‌ర్ రెడ్డి, అనిల్ సుంక‌ర ప్ర‌స్టీజియ‌స్ మూవీ `ఏజెంట్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌. ‌

విలక్షణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్న‌యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన తరువాతి ప్రాజెక్ట్ ఇటీవ‌ల 'సైరా' చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించిన స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డితో చేస్తున్నారు. ‌

తన హీరోలను బెస్ట్ స్టైలిష్ లుక్‌లో చూపించ‌డంలో స్పెషలిస్ట్ అయిన సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాలో అఖిల్‌ను స‌రికొత్త లుక్‌లో ప్ర‌జెంట్ చేయ‌బోతున్నారు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు.

సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం వంశీ కాంభినేష‌న్‌లో గతంలో `కిక్`, `రేసుగుర్రం` వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే కాగా వారిద్ద‌రి కలయికలో మరో బ్లాక్ బస్టర్ రూపొంద‌బోతుంది.

అఖిల్ హీరోగా న‌టిస్తోన్న 5వ చిత్రానికి `ఏజెంట్` టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు మేక‌ర్స్.. ఈ రోజు యంగ్ హీరో అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా `ఏజెంట్` మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి న్యూ మేకోవ‌ర్ లో డాషింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లో గడ్డంతో స్టైలిష్ హెయిర్‌డోతో స‌రికొత్త‌గా ఉన్నారు. సిగరెట్ తాగుతున్న అఖిల్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అఖిల్ తనను తాను ల‌వ‌ర్‌బాయ్ నుండి మాచోమేన్‌గా మార్చుకున్నారు. ఈ చిత్రంలో ఎన్నడూ చూడని స్టైలిష్ అవతార్ లో అఖిల్‌ను ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి ప్రజెంట్ చేశారు.

టైటిల్ డిజైన్‌లో సురేందర్ రెడ్డి మార్క్ క‌నిపిస్తోంది. మొత్తంమీద, ఏజెంట్ ఫస్ట్ లుక్ డిఫ‌రెంట్‌గా ఆకట్టుకుంటోంది.

అఖిల్‌ లాంటి ప్రామిసింగ్ స్టార్ - సురేందర్ రెడ్డి వంటి ప్రూవ్ చేసుకున్న దర్శకుడు - వక్కంతం వంశీ లాంటి విభిన్న రచయిత మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ లాంటి సక్సెస్ ఫుల్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటున్నఈ చిత్రం ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచ‌యం కాబోతుంది.

టాలీవుడ్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండ‌గా, రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్ర‌ఫి భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలీ ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి కో- ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌ 11 నుండి ప్రారంభం కానుంది. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ తో పాటు 2021 డిసెంబర్ 24న 'ఏజెంట్' చిత్రాన్ని విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్.

అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌: వ‌క్కంతం వంశీ,
సినిమాటోగ్ర‌ఫి: రాగూల్ హెరియన్ ధారుమాన్,
సంగీతం: త‌మ‌న్ ఎస్‌.ఎస్‌,
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి,
ఆర్ట్‌: అవినాష్ కొల్లా,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రికిపాటి,
కో- ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తిదీపా రెడ్డి,
నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌,
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved