pizza
Manchu Manoj Pan India Film Aham Brahmasmi To Be Launched On March 6th
మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'అహం బ్రహ్మాస్మి' మార్చి 6న ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

13 February 2020
Hyderabad

Manchu Manoj Pan India Film Aham Brahmasmi To Be Launched On March 6th

Hero Manchu Manoj is back with a bang. He has announced his next project titled Aham Brahmasmi. To be directed by Srikanth N Reddy, the film’s title logo has also been unveiled. Like the title, the poster also looks intriguing. There’s divinity in the poster.

Aham Brahmasmi to be launched on March 6th in a grand manner will be made as Pan India film in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.

Manchu Manoj and Nirmala Devi will produce the film on MM Arts Banner while Vidya Nirvana and Manchu Anand will present it.

Manoj announcing the project tweeted, “Coming forward to u guys after 3 years. Feel the same emotion as I felt for my first movie DD. Thanks for all ur love and support on and off-screen throughout this journey. I missed my Art which is my life. CineAmma, Vachesaaaa😎🙏🏻❤
Love you all Darlings❤🙏🏻. #AhamBrahmasmi #AB”

మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'అహం బ్రహ్మాస్మి' మార్చి 6న ప్రారంభం

హీరో మంచు మనోజ్ అదిరిపోయే రీతిలో వెండితెరపై కనిపించేందుకు మళ్లీ వస్తున్నారు. లేటెస్టుగా 'అహం బ్రహ్మాస్మి' అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు. టైటిల్ తరహాలోనే, పోస్టర్ సైతం ఉత్తేజభరితంగా ఉంది. అందులో ఒక దైవత్వం కనిపిస్తోంది.

మార్చి 6న గ్రాండ్ లెవల్లో లాంచ్ అవుతున్న 'అహం బ్రహ్మాస్మి'ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.

ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ పై మంచు మనోజ్, నిర్మలాదేవి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తున్నారు.

ఈ సినిమాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేసిన మనోజ్, "మూడేళ్ల తర్వాత మీ దగ్గరకు వస్తున్నాను. నా తొలి చిత్రం 'దొంగ దొంగది' సమయంలో ఎలాంటి ఉద్వేగాన్ని ఫీల్ అయ్యానో ఇప్పుడూ అదే భావోద్వేగంతో ఉన్నా. ఈ జర్నీ మొత్తం తెరపైనా, తెర బయటా మీరు నాపై చూపించిన ప్రేమకూ, మీరిచ్చిన సపోర్టుకూ థాంక్స్. నా లైఫ్ అయిన నా కళ (ఆర్ట్)ను నేను మిస్సయ్యాను. సినీ అమ్మ.. వచ్చేశా. లవ్ యు ఆల్ డార్లింగ్స్.. 'అహం బ్రహ్మాస్మి'.." అని ట్వీట్ చేశారు.

త్వరలోనే 'అహం బ్రహ్మాస్మి'కి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనున్నది.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved