pizza

Akhanda making video entertains the masses
నంద‌మూరి ఫ్యాన్స్‌కు న‌యా ట్రీట్‌.. ‘అఖండ‌’ మేకింగ్ వీడియో

You are at idlebrain.com > news today >
Follow Us

23 January 2022
Hyderabad

The latest making video of the blockbuster Akhanda has turned out to be a treat for the masses. This video shows how some of the key scenes in the film are shot. This film was released on 21st January on Hotstar OTT platform and had more than a million viewers watching it on the day one.

నంద‌మూరి ఫ్యాన్స్‌కు న‌యా ట్రీట్‌.. ‘అఖండ‌’ మేకింగ్ వీడియో

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ‌’. మాస్ హీరోయిజాన్ని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్ష‌కులంద‌రూ ఎంజాయ్ చేసేలా సినిమాను డైరెక్ట్ చేసే ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్స్ కావ‌డంతో ‘అఖండ‌’ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఒక వైపు క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా థియేట‌ర్స్‌కు పూర్తిస్థాయిలో రావ‌డానికి ప్రేక్ష‌కులు ఆలోచిస్తున్న త‌రుణంలో డిసెంబ‌ర్ 2న ‘అఖండ‌’ సినిమా విడుద‌లైంది.

మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను ఎలాంటి ప‌రిస్థితులలోనైనా ఆద‌రిస్తామ‌ని మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కులు నిరూపించారు. ‘అఖండ‌’కు తెలుగు సినీ ప్రేక్ష‌కులు విజయ హార‌తులు ప‌ట్టారు. కోవిడ్ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని సినిమా టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగానే అఖండ విజ‌యాన్ని సాధించింది. రీసెంట్‌గా 103 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుందీ చిత్రం. సింహా, లెజెండ్ చిత్రాల తరహాలోనే ‘అఖండ’ చిత్రంలోనూ బాల‌య్య‌ను బోయ‌పాటి శ్రీను ద్విపాత్రాభిన‌యంగా చూపించారు. రాయ‌ల‌సీమ‌లో గొడ‌వ‌లు లేకుండా ప్రజలందరూ బావుండాల‌ని కోరుకునే రైతు పాత్ర ఒక‌టైతే. విధిని, విధాత‌ను, విశ్వాన్ని ఎదిరించిన ప్ర‌తినాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టే అఖండ మ‌రో పాత్ర‌.

డైలాగ్స్‌, యాక్ష‌న్‌, డాన్సులు ఇలా ఒక‌టేమిటి ప్ర‌తి ఎలిమెంట్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యింది. ఈ సినిమాను ప్ర‌ధానంగా న‌డిపించిన ‘అఖండ రుద్ర సికింద‌ర్ అఘోరా’ పాత్రలో బాలకృష్ణ న‌ట‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ పాత్ర‌కు సంబంధించిన కీల‌కమైన సన్నివేశాల‌ను ఎలా చిత్రీక‌రించారో చూపిస్తూ చేసిన మేకింగ్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో బాల‌కృష్ణ‌, బోయ‌పాటితో పాటు ఇత‌ర చిత్ర యూనిట్ సినిమా మేకింగ్ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నేది స్ప‌ష్టంగా చూపించారు. ఓ సంద‌ర్భంలో బాల‌కృష్ణ స‌తీమ‌ణి వ‌సుంధ‌ర కూడా క‌నిపించారు.

‘అఖండ‌’ సినిమా థియేట‌ర్స్‌లో సరికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పి రూ.200 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. జ‌న‌వ‌రి 21న ఓటీటీలోనూ విడుద‌లైంది. ఓటీటీలోనూ తొలి రోజునే 10 ల‌క్ష‌లకు పైగా వ్యూస్‌ను సాధించి ‘అఖండ‌’ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved