pizza
Balakrishna - Boyapati's 'Akhanda' Title Roar Creates Record Crossing 50+ Million Views.. Team Thanks The Audience and Fans For Blasting Response
50 మిలియ‌న్స్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ సృష్టించిన బాల‌కృష్ణ‌, బోయ‌పాటిల `అఖండ‌` టైటిల్ రోర్‌ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన `అఖండ` టీమ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 April 2021
Hyderabad

 


'Kaalu duvve Nandi mundu rangu maarchina pandi.. Kaarukuthalu kusthe kapaalam pagilipoddi'

This dialogue has been reverberated across the both Telugu states ever since the release of NBK - Boyapati Srinu's 'Akhanda' Teaser titled 'Title Roar'. This dialogue became very popular and doubled the expectations on the hat-trick film, 'Akhanda' in the massive blockbuster combination of NataSimha Nandamuri Balakrishna and Mass Director Boyapati Srinu after Blockbusters 'Simha' and 'Legend'. Makers unveiled the teaser of 'Akhanda' as a Massive Title Roar on the auspicious day of Ugadi. The 'Title Roar' of 'Akhanda' got thumping response and cruising ahead with mighty response. The 'Title Roar' has garnered 50+ million views within 16 days and created a new record of the fastest 50+ million in Tollywood. The team thanks the Fans and audience for the massive success of 'Akhanda' title roar. On this occasion...

Director Boyapati Srinu said, " After 'Simha' and 'Legend' the audience have high expectations on 'Akhanda'. We made this film matching their high expectations. You will once again witness nataviswaroopam of Balayya in this film. I heartfully thank the audience and fans for making 'Akhanda' title roar a humongous success and made it fastest 50+ million views in such a short time. I wish everyone should wear a mask and follow all precautions during this Corona Crisis period. I request everyone to take vaccine as early as possible."

Producer Miryala Ravinder Reddy said, " Ever since the 'First Roar' of our film 'Akhanda' is released, the film is carrying very good expectations. Now with the powerful Title Roar of 'Akhanda', the expectations were raised to next level among the audience and fans. Boyapati Garu is handling this film superbly matching everyone's expectations. I hope 'Akhanda' title roar will create many more records surpassing 50+ million views. 'Akhanda' will be a prestigious film in our Dwaraka Creations banner. Hat-trick movie, 'Akhanda' in Balayya Babu and Boyapati Garla combination will be like a feast for Nandamuri fans. We will meet and celebrate in Theatres after we overcome the current crisis of Corona."

This Natasimha Nandamuri Balakrishna starrer will have Pragya Jaiswal, Jagapathi Babu, Srikanth and a huge cast. 'Akhanda' is being Prestigiously made in Dwaraka Creations banner Produced by Young Producer Miryala Ravinder Reddy under the presentation of Miryala Satyanarayana Reddy.

Cinematography: C.Ramprasad, Music: Thaman S, Dialogues: M Rathnam, Art Director: AS Prakash, Editing: Kotagiri Venkateswara Rao, Thammiraju, Fights: Stun Shiva, Ram – Lakshman, Presented by Miryala Satyanarayana Reddy,
Producer: Miryala Ravinder Reddy,
Direction: Boyapati Srinu

 

'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ‌ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ అంత పాపుల‌ర్ అవ‌డ‌మే కాకుండా సింహా', 'లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` మీద ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని మ‌రింత పెంచింది. ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్‌13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో `అఖండ` టీజ‌ర్ విడుద‌లై యూట్యూబ్‌లో అపూర్వ ఆద‌ర‌ణ‌తో దూసుకెళ్తూ కేవ‌లం 16రోజుల్లోనే 50మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజ‌ర్ ఇంత‌టి అఖండ విజ‌యానికి కార‌ణ‌మైన అభిమానుల‌కు, ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి అఖండ యూనిట్ అభినంద‌న‌లు తెలుపుతోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర‌ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ - ``సింహా, లెజెండ్ త‌ర్వాత బాల‌య్య‌గారితో చేస్తున్న`అఖండ` సినిమాపై ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌డం జ‌రిగింది. బాల‌య్య న‌టవిశ్వ‌రూపాన్నిఈ సినిమాలో మ‌రోసారి చూస్తారు. అతి త‌క్కువ రోజుల్లోనే 50మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసే స్థాయిలో `అఖండ` టైటిల్ రోర్‌ని ఇంత అఖండంగా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కి, అభిమానుల‌కి హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ప్ర‌స్తుతం ఈ క‌రోనా ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రు విధిగా మాస్క్ ధ‌రించి చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరుకుంటున్నాను. అలాగే అంద‌రూ వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను`` అన్నారు.

చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``మా మూవీ `ఫ‌స్ట్ రోర్‌` విడుద‌లైన ద‌గ్గ‌ర‌ నుండి సినిమాపై మంచి అంఛ‌నాలు ఉన్నాయి. ఇప్పుడు అఖండ టైటిల్ రోర్‌తో ప్రేక్ష‌కుల‌లో, అభిమానుల్లో ఆ అంఛనాలు రెట్టింపు అయ్యాయి. అంద‌రి ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని అందుకునేలా బోయ‌పాటిగారు ఈ చిత్రాన్ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు. అఖండ టైటిల్ రోర్ ప్రేక్ష‌కుల‌, అభిమానుల ఆద‌ర‌ణ‌తో 50మిలియ‌న్ల వ్యూస్ దాటి మ‌రిన్ని రికార్డ్స్ సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. మా ద్వార‌క క్రియేష‌న్స్ బేన‌ర్‌లో `అఖండ` త‌ప్ప‌కుండా ఒక ప్ర‌స్టేజియ‌స్ మూవీగా నిలుస్తుంది. బాల‌య్యబాబు, బోయ‌పాటి గార్ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న `అఖండ` నంద‌మూరి అభిమానుల్లో పండగ తీసుకొస్తుంది. ఇప్పుడున్న ఈ క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకున్న త‌ర్వాత త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో క‌లుద్దాం`` అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌తో పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: స్ట‌న్ శివ, రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved