pizza
Ala Vaikunthapurramuloo Ramuloo Ramulaa song released
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "అల వైకుంఠపురములో'' 'రాములో... రాముల' గీతం
విడుదలైన కొద్దీ సేపటికే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నవైనం
You are at idlebrain.com > news today >
Follow Us

26 October, 2019
Hyderabad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తెలుగులో ఒక పాటకు 800K కు పైగా లైక్స్ రావడం ఇదే ప్రధమం. థమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు థమన్ స్వరపరచిన 'రాములో రాముల' అనే పాట విడుదలైంది. విడుదలైన కొద్దీ సేపటికే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నవైనం ఈ గీతం సొంతం. ఈ మధ్య వరుసగా మాస్ సాంగ్స్ రాస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న కాసర్ల శ్యామ్ ఈ పాట రాసారు. ఈ మాస్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా పాడారు. ఈ పాటకు శేఖర్ మాష్టర్ నృత్య రీతులు సమకూర్చారు.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అల్లు అర్జున్,త్రివిక్రమ్ .... వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కు భారీ క్రేజ్ నెలకొంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

నటీనటులు
‘అల వైకుంఠపురములో” ని తారలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్; పీఆర్వో : లక్ష్మీ వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved