15 December 2014
Hyderabad
ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకి అద్బుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు చక్రి.. దాదాపు 85 చిత్రాలకి తన సంగీతాన్ని అందించారు.. ఈరోజు ఉదయం చక్రి మరణవార్త విన్నవెంటనే అల్లు అర్జున్ దిగ్బ్రాంతి చెందారు. తన కెరీర్ ఒన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దేశముదురు చిత్రానికి సూపర్బ్ ఎనర్జిటిక్ సంగీతాన్ని అందించారు చక్రి. ఆ సినిమా సక్సస్ లో ఓ మెయిన్ ఫిల్లర్ గా నిలిచిన చక్రి ఈరోజు ఇలా హఠార్మణం చెందటం చాలా భాదాకరం. చక్రి మరణం తెలుగు సినిమా పరశ్రమకి తీవ్రమైన లోటు , చక్రి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ అలానే వారి కుటుంబ సభ్యులకి నా తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాను అని అల్లు అర్జున్ అన్నారు