pizza
Sunil Kumar Reddy's Alluri Sitarama Raju biopic movie
రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో నిర్మాణం లో పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో
అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్
You are at idlebrain.com > news today >
Follow Us

28 January 2019
Hyderabad

రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో బ్యానర్ పై... డా. శ్రీనివాస్ నిర్మాతగా.... సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను.... రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో... అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మన్యంలో జరుగుతున్న తెల్లదొరల ఆకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాట గాథను ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారు. మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు యెక్కలి రవీంద్రబాబు, డా.ఎల్.ఎన్.రావు... ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.... 'అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వసతులతో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ స్టూడియో అండ్ అకాడమీ బ్యానర్ పై ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీ ల పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది. నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు కూడా ఇందులో నటిస్తారు. మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ వర్క్ కు సంబంధించిన సీజీ వర్క్ ఇప్పటికే జరుగుతోంది. చరిత్రకారుల సహకారంతో సీతారామరాజు మరణానికి సంబంధించిన మిస్టరీని కూడా ఈ చిత్రంలో చూపించనున్నాం. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తాం'. అని అన్నారు.

సాంకేతిక నిపుణులు
బ్యానర్ - రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో
నిర్మాత - డా.శ్రీనివాస్
సహ నిర్మాతలు - యెక్కలి రవీంద్రబాబు, డా.ఎల్.ఎన్.రావు...
ఎగ్జిక్యూటివ్ - నిర్మాత బాపిరాజు
రచన, దర్శకత్వం - పి. సునీల్ కుమార్ రెడ్డి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved