తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను గడ గడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం \'కిల్లింగ్ వీరప్పన్\'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. రీసెంట్ గా సినిమా ట్రైలర్ చూసిన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ \'కిల్లింగ్ వీరప్పన్\' ట్రైలర్ నమ్మశక్యం కాని విధంగా ఉందని ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు అమితాబ్ ఒక తెలుగు సినిమా గురించి ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి. దీని గురించి రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. \'\'అమిత్ జీ నేను రియల్ స్టోరీస్ తీయడంలో దిట్ట అని నమ్మే వ్యక్తి. నాకు తెలిసి ఆయనకు సినిమాలో ఉన్న అసాధారణమైన ఊహాచిత్రాలు, ఫిలిం యొక్క ఇంటెన్సిటీ బాగా నచ్చినట్లుంది\' అని తన అభిప్రాయం వెల్లడించారు.
శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞాశెట్టి, పరూల్ యాదవ్, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రమ్మీ; సంగీతం:రవిశంకర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సధీర్ చంద్ర పధిరి; నిర్మాతలు:బీవి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, బిఎస్ సుధీంద్ర; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ.