pizza
Ammayi Aaruguru release on 25 March
మార్చి 25న విడుదలవుతున్న ‘అమ్మాయి ఆరుగురు’
You are at idlebrain.com > news today >
Follow Us

23 March 2016
Hyderaba
d

అక్ష‌య్ ప్ర‌త్యూష ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై జి.ముర‌ళిప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌చంద్ర‌, అశాల‌త హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అమ్మాయి ఆరుగురు’. ఈ చిత్రం మార్చి 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

దర్శకుడు జి.మురళిప్రసాద్ మాట్లాడుతూ ‘’ఇది నా మూడో సినిమా. అందరి మిత్రుల సహకారంతో సినిమాను అనుకున్న సమయంలోనే పూర్తి చేశానువందేమాతరం శ్రీనివాస్ గారు మంచి మ్యూజిక్ అందించారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి హర్రర్ కాన్సెప్ట్ మూవీ. ఆరుగురు డబ్బున్న అబ్బాయిలు ఓ జంటను చంపేస్తారు. ఆ జంటలో అమ్మాయి దెయ్యంగా మారి ఆరుగురు యువకులపై ఎలా ప్రతీకారం తీర్చుకునిందనేదే కథ. సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

హీరో, నిర్మాత రామచంద్ర మాట్లాడుతూ ‘’సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రం. కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ కు తప్పకుండా నచ్చే చిత్రమవుతుంది. సినిమాను మార్చి 25న ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నాం’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ వడ్డేల్లి సుధీర్ మాట్లాడుతూ ‘’సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నాం. సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

జూ.రేలంగి, రవి, మాస్టర్ అక్షయ్, జబర్ దస్త్ రాము, శ్రీనివాసరెడ్డి, రసూల్, యన్.యమ్.నజీర్, శేఖర్ బాబు, మునీంద్ర,అంజలి, శోభ, చంద్రమౌళి, కౌశిక్, కామాక్షి, పూనమ్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కథ-అక్షయ్ ప్రత్యూష ఎంటర్ టైన్మెంట్స్, మాటలు- సాయికుమార్ రెడ్డి, కెమెరా- వడ్డేల్లి సుధీర్, ఎడిటర్- నందమూరి హరి, సంగీతం- వందేమాతరం శ్రీనివాస్, ఆర్ట్ – వెంకటేష్, నిర్మాత, పర్యవేక్షణ – రామచంద్ర దోసపాటి, దర్శకత్వం – జి.మురళిప్రసాద్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved