pizza
Anaganaga O Prema Katha teaser Launched by Hero "RANA DAGGUBAT
అనగనగా ఓ ప్రేమకథ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ హీరో 'రాణా'
You are at idlebrain.com > news today >
Follow Us

22 September 2018
Hyderabad

Anaganaga O Prema Katha, a movie by Pratap Tatamsetti teaser has been launched today. The movie features Viraj J. Ashwin, nephew of Marthand K. Venkatesh as the male of this movie. The female lead of this movie is Riddhi Kumar, the actress who featured in the movie Lover. The movie's shoot has come to a conclusion and now the post production work is going on.

Rana Daggubati, who has taken a liking for small and impressive films of late is going to present this movie. The actor's choice hasn't been wrong so far, with C/o Kancharapalem doing so well at the box office.

The first look of this movie has been launched by Varun Tej, the mega price of the Telugu film industry. The music of this movie is being composed by the associate of A.R.Rehman, Anjan. Anaganaga O Prema Katha cinematography is being handled by Edurolu Raju. This movie is being produced by K.L.N.Raju under the banner of Thousand Lights Media Private Limited. The movie is all set to release in the month of October 2018.

The director reveals that the current generation is developing a liking for small budget movies. Rom-coms especially are highly known for their music, cinematography and the lead pair. He further adds that Anaganaga O Prema Katha and the sea share a deep connection and that is the reason, since the first motion picture release, it is being highly being focussed on.

Banner : Thousand lights media pvt ltd

Movie : ANAGANAGA O PREMA KATHA

Producer : K L N RAJU

Story & Screenplay & Dialogues& Director : Pratap Tatamsetti

Artist : Viraj j Ashwin,Riddhi kumar,Radha banga

Music : KC . ANJAN

Art director : Ramanjaneyulu

CIinematographer : EDUROLU RAJU

Lyrics : Srimani

Dance master : Aneesh

Fight master : Ramkrishna

అనగనగా ఓ ప్రేమకథ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ హీరో 'రాణా'

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ గారు ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అలాగే ఈ చిత్రానికి హీరో గా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ లుగా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు

ప్రముఖ హీరో రాణా దగ్గుబాటి ఈ సినిమా టీజర్ ను ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతా ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు. ఇటీవలే కేరాఫ్ కంచరపాలెం సినిమాను కూడా తన ప్రొడక్షన్లో నిర్మించగా..ఆ సినిమాకు ఎంత మంచి పేరొచ్చిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసి మరోసారి చిన్న సినిమాలపై తనకున్న నమ్మకాన్ని చూపించారు. ఇటీవలే ఈసినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాత గా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ఈ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రాణా' తమ చిత్రం టీజర్ ను విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.'రాణా' గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రం టీజర్చా ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు

హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ 'రాణా' గారు నా ఈ తొలి చిత్రం టీజర్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved