pizza
Anchor Ravi turns Hero
యాంకర్ రవి హీరో అయ్యాడోచ్!!
You are at idlebrain.com > news today >
Follow Us

25 February 2017
Hyderabad

He's got the style and charisma that would give a tough competition to the actors of the day. And it's majorly because of that he has a major pull on television. He's one of the most popular television personalities and also the most sought after to host shows and events. And now, the man is set to take the plunge into the big screen and will debut as a hero soon!

With the title "Idi Ma Prema Katha", and tagline 1>99, the film is to be directed by Ayodhya Karthik and has music by Karthik Kodakandla. The film's shooting has been completed and post-production is on in full swing.

The film is set to release as a summer treat this April. The first look of Ravi from the film will be released soon with a well-known film personality sharing it online.

Publicity designs: Omkar Kadiyam
Songs (lyrics): Dinesh (Nani)
Music Director: Karthik Kodakandla
Cinematography: Mohan Reddy
Co-producer: PLK Reddy
Producer: Matsya Creations
Director: Ayodhya Karthik

యాంకర్ రవి హీరో అయ్యాడోచ్!!

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి అలియాస్ యాంకర్ రవి అతి త్వరలో వెండితెరపై కథానాయకుడిగా పరిచయం కానున్నాడు.

మత్స్య క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ద్వారా యాంకర్ రవి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

"ఇది మా ప్రేమ కథ" అనే టైటిల్ నిర్ణయించబడిన ఈ చిత్రానికి "1>99" (1 ఈజ్ గ్రేటర్ దేన్ 99) అనేది ట్యాగ్ లైన్. కార్తీక్ కొడకండ్ల సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

రవి సరసన ఇద్దరు అందాల భామలు నటించిన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని రవి ఫస్ట్ లుక్ ను ఓ ప్రముఖ సెలబ్రిటీ ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: ఓంకార్ కడియం, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved