pizza
Angel in fourth schedule
నాల్గోవ షెడ్యూల్ లో బిజీగా ఉన్న “ఏంజెల్”
You are at idlebrain.com > news today >
Follow Us

17 January 2017
Hyderaba
d

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ ఏంజెల్. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని తాజాగా జనవరి 16 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాల్గోవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ టాలెండ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శకధరీడు రాజమౌళి అసోసియేట్ బాహుబలి పళని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ ని జనవరి నెలాఖరు వరకు నిర్విహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి, స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved