pizza
Panche Kattu in Bangarraju is inspired by ANR
బంగార్రాజుతో నాన్నగారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం - కింగ్ నాగార్జున
You are at idlebrain.com > news today >
Follow Us

20 September 2021
Hyderabad

అక్కినేని నాగేశ్వర రావు జయంతి సందర్భంగా కింగ్ నాగార్జున ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇక తెలుగు ప్రజల గుండెల్లో దసరా బుల్లోడుగా స్థానం సంపాదించుకున్న ఏఎన్నార్ ఆ సినిమాలో పంచెకట్టుతో కనిపించి మెప్పించారు. నాటి ఏఎన్నార్ గారి రూపాన్ని నాగార్జున రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన అంటూ అచ్చ తెలుగు, పంచెకట్టులో మెరిశారు నాగార్జున. ఆ సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంతటి ఆదరణ దక్కిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో నాగార్జున బంగార్రాజుగా నటిస్తున్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావును గుర్తుకు తెచ్చేలా బంగార్రాజుపాత్రను డిజైన్ చేశారు. ఈ మేరకు ఆయన జయంతి సందర్భంగా సినిమాలోని ఆయన పాత్ర, ఆ క్యారెక్టర్ లుక్‌కు సంబంధించిన విశేషాలు నాగార్జున వివరించారు.

‘సెప్టెంబర్ 20వ తారీఖు. నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. నా హీరో, నా స్ఫూర్తి ప్రధాత, నాన్నగారి పుట్టిన రోజు. నాన్నగారికి పంచెకట్టు అంటే చాలా ఇష్టం. ఆయన పంచె కట్టుకుంటే చూసినప్పుడల్లా ముచ్చటేసేది. ఆయనకు పొందూరు ఖద్దరు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా పొందూరు ఖద్దరే. నవరత్నాల హారం. నవరత్నాల ఉంగరం. అలాగే నేను పెట్టుకున్న వాచ్ నాకంటే సీనియర్. నాన్నగారి ఫేవరేట్ వాచ్..ఇప్పుడు నా ఫేవరేట్ వాచ్. ఇవన్నీ వేసుకుంటే..ఆయన నాతోనే ఉన్నట్టు ఉంటుంది. ఏదో తృప్తి. నాన్న గారి పంచెకట్టు అందాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే మా ఈ ప్రయత్నం. ఏఎన్నార్ లివ్స్ ఆన్’ అంటూ బంగార్రాజు సినిమాలో ఆయన పాత్ర గురించి నాగార్జున చెప్పారు.

కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా బంగార్రాజును అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నాగార్జున నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండ‌గా, సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్.

తారాగణం: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మరియు జాన్సీ

సాంకేతిక వ‌ర్గం:
కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్లు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
DOP: యువరాజ్
ఆర్ట్‌: బ్రహ్మ కడలి
PRO: వంశీ-శేఖర్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved