pizza

Nani’s Ante Sundaraniki completes shooting part
నాని.. ‘అంటే సుందరానికీ’ షూటింగ్ పూర్తి

You are at idlebrain.com > news today >
Follow Us

23 January 2022
Hyderabad

Nani’s next film Ante Sundaraniki has completed it’s shoot today. Vivek Athreya who has proved himself with films like Mental Madhilo and Broche Varevarura is directing this film with a variety title. The zeroth look teaser which was released recently has got everybody’s attention as it plays to the strengths of Nani. Nazriya Fahadh is making her debut in a Telugu stright film with Ante Sundaraniki. New age music director Vivek Sagar composes music for this film. Mythri Movie Makers are bankrolling the film. Ante Sundaraniki is slated for the summer 2022 release.

నాని.. ‘అంటే సుందరానికీ’ షూటింగ్ పూర్తి

నేచుర‌ల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘అంటే.. సుంద‌రానికీ!’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్‌.వై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. వివేక్ ఆత్రేయ చివ‌రి స‌న్నివేశానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేసిన త‌ర్వాత సినిమా పూర్త‌య్యింద‌ని అనౌన్స్ చేశారు. దాన్ని త‌న మొబైల్ కెమెరాలో చిత్రీక‌రించారు నాని. త‌ర్వాత యూనిట్ స‌భ్యులంద‌రితో క‌లిసి క‌ల‌సి ‘అంటే.. సుందరానికీ!’ అంటూ గట్టిగా చెప్పారు. ఈ వీడియో చూస్తుంటే సినిమాను పూర్తి చేయడంపై యూనిట్ హ్యపీనెస్‌ను మ‌నం గ‌మ‌నించ‌వచ్చు.

మ‌ల‌యాళ హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా వంటి ఎంటర్‌టైనింగ్ మూవీస్ వ‌రుస విజ‌యాల‌ను సాధించిన డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అదీ కాకుండా ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్’తో నాని మరో హిట్ సొంతం చేసుకున్నారు.

‘అంటే.. సుందరానికీ!’ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, వివేక్ సాగ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved