pizza
ATM Not Working ready for release
రిలీజుకి సిద్దమైన సునీల్ కుమార్ రెడ్డి ​ATM - NOT WORKING
You are at idlebrain.com > news today >
Follow Us

07 February 2017
Hyderabad

పెద్దనోట్లరద్దు నేపధ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ వర్కింగ్ నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కధని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ మరియు శ్రావ్య ఫిలింస్ బ్యానర్ల సమర్పణలో కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు, సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.

అనంత్(A), త్రిలోక్(T), మహేష్(M) అనే ముగ్గురు పనీ పాట లేని కుర్రాళ్ళ జీవితంలో డిమాని టైజేషన్ సృష్టించిన సునామీ, ఎటిఎం క్యు లైన్ లో పుట్టన ప్రేమ, దాని పర్యవసానాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతు స్వతంత్ర భారత దేశంలోని ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధంగా ప్రభావితంచేసిన నిర్ణయం డిమాని టైజేషన్. ఈ నిర్ణయం నేపథ్యంలో ఒక జాతి జాతి 50 రోజులు క్యూలైన్ లో గడిపేసింది. రాజకీయాలు, ఆర్ధికనిపుణులు, సామాన్యులు పండితులు, పామరులుఅందరూచర్చించిన విషయానికి ఒక క్యారికేచర్లాంటిది ఈ చిత్రం.125 కోట్ల మందిని ప్రభావితంచేసిన ఈ నిర్ణయం సృష్టించిన అరుదైన సంఘటలనుసునిశితంగా, స్ప్రుశించేప్రయత్నమే ఈ చిత్రం” అని తెలియజేసారు.

కారుణ్య యార్ల గడ్డ, పవన్ హీరో హీరోయిన్ లగా, రాకేష్, ఆషా చౌదరి, మహేంద్ర, నారాయణ, వినోద్,కరణ్, మహేష్, చిల్లర రాంబాబు, అంబటి శ్రీను, కిషోర్ దాస్, వీరభద్రం, గబ్బర్ సింగ్ ఆంజనేయులు, లక్ష్మి, తిరుపతి దొరై తదితరులుముఖ్య పాత్ర పోషించారు.

ఈ చిత్రానికి సంగీతం-ప్రవీణ్ ఇమ్మడి, లిరిక్స్-వీరేంద్ర, వాసవి రెడ్డి. కెమెరా-శివరాం. ఎడిటర్-సామ్యూల్ కళ్యాణ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- బి. బాపిరాజు. నిర్మాతలు-కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు. రచన, దర్శకత్వం- పి. సునీల్ కుమార్ రెడ్డి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved