pizza
Baahubali Audio on 13th By YUVA MEDIA at Tirupathi
You are at idlebrain.com > news today >
Follow Us

09 June 2015
Hyderabad

యువ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. ద్వారా
‘బాహుబలి`ది బిగినింగ్‌’ ఆడియో వేడుక తిరుపతిలో..!!

దర్శకసంచలనం యస్‌.యస్‌.రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి`ది బిగినింగ్‌’ ఆడియో ఆవిష్కరణోత్సవం ఈనెల 13న.. తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించబడనుంది. ‘యువ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.’ ఈ వేడుకను నిర్వహించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకొంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. జులై 10న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆర్కా మీడియా పతాకంపై కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ`ప్రసాద్‌ దేవినేని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు!!


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved