pizza
Babu Bangaram teaser release on 6 June
జూన్ 6 న విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి 'బాబు బంగారం' టీజ‌ర్ రిలీజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 May 2016
Hyderaba
d

దృశ్యమ్‌, గోపాల‌గోపాల లాంటి కాన్సెప్ట్ డ్ చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ని అందించిన విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం. ఈచిత్రం యోక్క మెద‌టి లుక్ ని ఇటీవ‌లే విడ‌దల చేశారు. ఇప్ప‌టికే దాదాపు టాకీ మెత్తం పూర్త‌యిన ఈచిత్రం ఓ సాంగ్‌, ఓ ఫైట్ మాత్ర‌మే బ్యాల‌న్స్ వుంది. ఈచిత్రం యోక్క‌ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని జూన్ 6 న విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్బ‌మ్‌గా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్ అంటేనే ల‌క్ష్మి, తుల‌సి లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ గుర్తోస్తాయి. ఈ మ‌ద్య‌కాలంలో హిట్ పెయిర్ గా సూప‌ర్బ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న వీరిద్ధ‌రి కాంబినేష‌న్ లో, వ‌రుస కాన్సెప్ట్ చిత్రాల‌తో స‌న్సేష‌న‌ల్‌ స‌క్స‌స్ లు సాధిస్తున్న ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌కుడిగా మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ లో , ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మిస్తున్నాము. దీనికి సంభందించిన మెద‌టి లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి టైటిల్ కి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. అలానే జూన్ 6న ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని విడుదల చేస్తున్నాం. ఈ టీజ‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నాము. వెంక‌టేష్, న‌య‌న‌తార లాంటి న‌టుల కి మారుతి లాంటి ద‌ర్శ‌కుడు తోడైతే ప్రేక్ష‌కుడికి న‌వ్వుల పంట అవుతుంది. మా చిత్రం ఆశ‌క్తిక‌ర‌మైన‌ క‌థ తో ఆరోగ్య‌క‌ర‌మైన వినోదాన్ని ఫ్యామిలి ఆడియ‌న్స్ అంద‌రికి ద‌ర్శ‌కుడు మారుతి వినోదాన్ని వ‌డ్డించ‌టం ఖాయం. భ‌లే భ‌లే మ‌గాడివొయ్ లాంటి చిత్రం త‌రువాత మారుతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ కి బ్రాండ్ గా మారాడు. ర‌న్ జా రన్, జిల్ ,ఉత్తమ విలన్," వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. అన్ని సాంగ్స్ చాలా చ‌క్క‌గా ఇచ్చారు. విన‌గానే హ‌మ్ చేసుకునేలా వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్నారు. వెంక‌టేష్ గారి కామెడి టైమింగ్స్ ని మైండ్ లో పెట్టుకుని మారుతి డైలాగ్స్ రాసారు. ఇటీవలె యూరప్ లొ అందమైన లోకెషన్స్ లో రెండు పాటలని చిత్రీకరించాం మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి అన్నారు.

ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృద్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌జి, సంప‌త్‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజా ర‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా..

డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌
స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
సంగీతం- జిబ్రాన్‌
నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌
క‌థ‌,క‌థ‌నం,ద‌ర్శ‌క‌త్వమ్ - మారుతి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved