pizza
Baby release on Shivaratri
శివరాత్రికి "బేబీ" విడుదల!
You are at idlebrain.com > news today >
Follow Us

10 February 2016
Hyderaba
d

తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన "బేబీ" చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అందరూ కొత్త నటీనటులతో నూతన నిర్మాణ సంస్థలు సన్ షైన్ క్రియేషన్స్ మరియు సుచిన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లో ప్రఖ్యాత దర్శకులు భారతీ రాజా తనయుడు మనోజ్ భారతీరాజా ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. అంజలిరావ్, శైరా గర్గ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బేబి సతన్య, బేబి శ్రీవర్షిణి కీలకపాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోట్లపాటి మురళి నాయుడు మాట్లాడుతూ.. "తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన "బేబీ" చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసాం. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కుడా అలరిస్తుందన్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించం. ప్రఖ్యాత దర్శకులు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. శివరాత్రికి బేబీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

మనోజ్ భారతీరాజా, అంజలీరావ్, శైరా గర్గ్, బేబీ సతన్య, బేబీ శ్రీవర్షిణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మి, మాటలు: యమ్.రాజశేఖర్ రెడ్డి, సంగీతం: హరీష్ - సతీష్, ఎడిటింగ్: భగత్ సింగ్, చాయాగ్రహణం: జోన్స్ ఆనంద్, నిర్మాతలు: మురళినాయుడు కోట్లపాటి, దుద్దుపుడి సుహాస దర్శకత్వం: డి.సురేష్!



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved