pizza
Suriya's 'Bandobast' to celebrate a grand pre-release event in September second week
సెప్టెంబర్ రెండోవారంలో గ్రాండ్ గా 'బందోబస్త్' ప్రీ రిలీజ్ ఫంక్షన్
You are at idlebrain.com > news today >
Follow Us

1 September 2019
Hyderabad


Suriya, the actor who has carved a distinct image with n unique films such as 'Ghajini' and 'Singham' series among the Telugu audience, is getting ready with the novel commercial action thriller 'Bandobast'. 'Rangam' fame director KV Anand has directed this much-awaited movie. Subaskaran of Lyca Productions, who brought the acclaimed film 'Nawab' and the visual wonder '2.0' to the Telugu audience, is producing 'Bandobast'. Starring Sayyeshaa Saigal as Suriya's pair and featuring Malayalam superstar Mohanlal in a crucial role (as India's Prime Minister), this film is slated to release on September 20.

Prominent Tollywood producer NV Prasad is releasing the movie in the Telugu States. Ahead of the film's release, a grand pre-release event will be held in the second week of September.

'Enno Tharala Sangamam', a patriotic song released on Independence Day, has been a big hit. The mass song 'Cheruku Mukkalanti' has also highly impressed the listeners. Suriya's get-ups as a farmer and a commando have upped the curiosity of the audience. The film's teaser and trailer have trended big-time on YouTube and social media. From Mohanlal's dialogues to expectations from Suriya's acting, everything about the film is special. That's why the film's satellite rights have got sold like a hot cake much ahead of the theatrical release. Gemini of Sun TV network has bought the satellite rights for a huge price.

The songs of the film's Tamil version, 'Kaappaan', were released recently on the hands of Superstar Rajinikanth. Harris Jayaraj's music has received a tremendous response. The Telugu version's audio will be unveiled soon on Sony Music.

Suriya, Mohanlal, Boman Irani, Arya, Sayyeshaa Saigal, Samuthirakani, Poorna, Nagineedu and others will also be seen in key roles.

PRO: Surendra Kumar Naidu-Phani Kandukuri. Writer: PKP, Sri Ramakrishna. Lyrics: Vanamali, Chandrabose. Art Director: DRK Kiran. Editor: Anthony. Stunts: Dhilip Subbarayan, Peter Heins. Dances: Baba Bhaskar, Sobhi, Ganesh Acharya. Cinematography: MS Prabhu. Music: Harris Jayaraj. Producer: Subhaskaran. Director: KV Anand.

ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. 'గజిని', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'బందోబస్త్'. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. తెలుగు ప్రేక్షకులకు 'నవాబ్', విజువల్ వండర్ '2.0' చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సెప్టెంబర్ రెండో వారంలో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన దేశభక్తి గీతం 'ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...' ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, 'చెరుకు ముక్కలాంటి...' పాట మాస్ ప్రేక్షకులను మెప్పించింది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఆల్రెడీ విడుదలైన తెలుగు టీజర్, ట్రయిలర్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాకిస్తాన్‌ తీరును ఎండగడుతూ మోహ‌న్‌లాల్‌ చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అందువల్ల, విడుదలకు నెలన్నర ముందే శాటిలైట్ హక్కులు హాట్ కేకులా అమ్ముడయ్యాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్, స‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన 'జెమినీ' సొంతం చేసుకుంది. 'బందోబస్త్' తమిళ వెర్షన్ 'కాప్పాన్' పాటలు ఇటీవలే సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలయ్యాయి. సోనీ మ్యూజిక్ సంస్థ ద్వారా ఆడియో విడుదల కానుంది.

సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తున్న ఈ సినిమాలో భారత ప్రధానిగా మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, కీలక పాత్రలో ఆర్య నటిస్తున్నారు. బోమన్ ఇరానీ, ఆర్య, సాయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి, రైటర్: పి.కె.పి & శ్రీ రామకృష్ణ, లిరిక్స్: చంద్రబోస్, వనమాలి, ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె. కిరణ్, ఎడిటర్: ఆంటోనీ, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్, డాన్స్: బాబా భాస్కర్, శోభి, గణేష్ ఆచార్య, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్, నిర్మాత: సుభాస్కరణ్, దర్శకత్వం: కె.వి. ఆనంద్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved