pizza
BA Pass release on 28 August
You are at idlebrain.com > news today >
Follow Us

26 August 2015
Hyderabad

28న వస్తున్న బి.ఎ.పాస్‌


బాలీవుడ్‌లో సంచనం సృష్టించి తెలుగు ప్రేక్షకును అలరించడానికి ‘బి.ఎ.పాస్‌’ చిత్రం ఆగష్టు 28న భారీ ఎత్తున విడుదకు సిద్దమయింది. ఈ చిత్రాన్ని తెలుగులో సంపత్‌ కుమార్‌ సమర్పణలో ఎం.అచ్చిబాబు నిర్మాతగా మినిమం గ్యారెంటి మూవీస్‌ (ఎం.జి.ఎం) నిర్మిస్తోంది

చిత్ర విడుదల సందర్భంగా నిర్మాత అచ్చిబాబు మాట్లాడుతూ.. ‘ఇంతవరకు ఇండియన్‌ స్క్రీన్‌ మీద రాని బోల్డ్‌ చిత్రమిది. కేవలం బోల్డ్‌ మాత్రమే కాదు ఇందులో ఎమోషన్స్‌, డ్రామా, సెంటిమెంట్‌ ఇలా ప్రతి అంశం చాలా అద్బుతంగా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్‌ బాల్‌. ‘చక్‌ దే ఇండియా’ చిత్రంతో ఆకట్టుకున్న శిల్ప శుక్లా ఈ చిత్రంలో తన అద్భుత నటనతో అవార్డులు, రివార్డులు సంపాదించుకుంది. షాదాబ్‌ కమల్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి విమర్శకు ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రానికి మాటలు అందించిన తెన్నేటి గారికి నా కృతజ్ఞ్యతలు . ఆయన సంభాషణలు డబ్బింగ్‌ చిత్రంలా కాకుండా అచ్చమైన తెలుగు చిత్రానికి రాసినట్టుగా ఉన్నాయి. అన్ని కార్యక్రమాు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని 28న విడుద చేస్తున్నాము’’ అన్నారు.

మాట రచయిత వి.ఎస్‌.పి తెన్నేటి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి మాటలు రాసే అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మాత అచ్చిబాబుకు నా కృతజ్ఞ్యతలు . ఈ చిత్రం మొదట హిందీలో చూసినప్పుడు ఒకింత షాక్‌కి గురయ్యాను. సినిమాలోని ఫస్ట్‌ హాఫ్‌ ఎంత బోల్డ్‌ గా ఉంటుందో సెకండ్‌ హాఫ అంత ఎమోషనల్ గా ఉంటుంది ’’ అన్నారు. చిత్ర సమర్పకు సంపత్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని 28న ఎత్తున విడుద చేయబోతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఎక్కడా ఇది డబ్బింగ్‌ చిత్రంలా అనిపించదు. ఇటివల సినీ ప్రముఖుతో ఈ చిత్రం ప్రివ్యూ వేసుకొని చూసుకున్నాము. అందరి దగ్గరనుంచి ఒకటే రెస్పాన్స్‌ ‘సినిమా సూపర్‌ హిట్‌’ అని. బాలీవుడ్‌ కంటే తెలుగు లోనే ఎక్కువ విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాం . మినిమం గ్యారెంటి మూవీస్‌ (ఎం.జి.ఎం) సంస్థ నుండి త్వరలో మరో చిత్రం విడుద చేయనున్నాం.’ అన్నారు.

ఆగష్టు 28న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సమర్పణ :సంపత్‌ కుమార్‌ నిర్వహణ: డి.నారాయణ, మాటలు : వి.ఎస్‌.పి తెన్నేటి, లైన్‌ ప్రొడ్యూసర్‌: దుర్గ చేపూరి,

సంగీతం: అలోకనంద దాస్‌ గుప్తా, నిర్మాత-ఎం.అచ్చిబాబు
సినిమాటోగ్రఫీ`దర్శకత్వం: అజయ్‌ భాల్‌



 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved