pizza
Bellamkonda Sai Sreenivas’ Grand Bollywood Debut With The Remake Of SS Rajamouli’s Prabhas starrer ‘Chatrapathi’ To Be Directed By VV Vinayak Under Pen Studios
వి.వి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో పెన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
You are at idlebrain.com > news today >
 
Follow Us

27 November -2020
Hyderabad

Mumbai: One of the most talented and successful actor of Telugu film industry, Bellamkonda Sai Sreenivas is ready for his Bollywood debut. In fact he has chosen a grand vehicle and is ready to step into ‘Baahubali’ fame Prabhas’ shoes and will star in a remake of SS Rajamouli directed, Prabhas starrer mega hit ‘Chatrapathi’. Pen Studios helmed by Dr. Jayantilal Gada is bankrolling this project for Bollywood and has signed Bellamkonda already.

Bellamkonda Sreenivas has become a name to reckon with in Tollywood in a short time and his films on YouTube are breaking the internet. Bellamkonda debuted in 2014 with a superhit action entertainer ‘Alludu Seenu’ and skyrocketed to fame thereafter. The hard-working actor has now trained his eyes on Bollywood. Pen Studios and Dr. Jayantilal Gada has been a name behind many successful commercial ventures that were high on content too. These two forces coming together will definitely translate into a great project.

Talking about the project Dr. Jayantilal Gada, MD & Chairman of Pen Studios said “‘Chatrapathi’ is a great script and we needed a southern star to carry it to Bollywood, and we saw Bellamkonda as a perfect fit. We are very excited about this project, and everything is falling in place at a great speed. We have updated the script to match Bollywood sensibilities.”

‘Chatrapthi’ that originally starred Prabhas is a story of a young man Shivaji and his family. The film received a huge appreciation in Tollywood and it turned out to be a super hit. It has a great scope of performance for Bellamkonda Sai Sreenivas and the talented actor is looking forward to arrive in Bollywood with a bang.

Known for making mass and perfect commercial entertainers, ace director VV Vinayak who delivered blockbusters with all the top stars in Tollywood will wield the megaphone for the Bollywood launch pad film of Bellamkonda Sai Sreenivas. Besides having vast experience in filmmaking, VV Vinayak is very successful in handling remakes as well. Particularly his film ‘Khaidi No 150, that marked the re-entry of megastar Chiranjeevi ended up as non-Baahubali hit. Many top directors like Rajamouli lauded VV Vinayak for his elevation of heroism in films.

Incidentally, it was VV Vinayak who launched Bellamkonda Sai Sreenivas in Tollywood with ‘Alludu Seenu’ and he is now introducing the young hero in Bollywood. The film also marks Bollywood debut of VV Vinayak. And ‘Chatrapathi remake is a perfect choice for the Bollywood entry of the two.

Bellamkonda Sai Sreenivas excitedly said “This is a perfect project for my big debut in Bollywood. It’s a great opportunity to collaborate with Dr. Gada and Pen Studios, and to be reunited with my first ever director VV Vinayak sir. Although, taking on a role that Prabhas’ did is a huge responsibility, but I am glad I did, as it’s a perfect script.”

A commercial hero and a commercial director make a deadly combination to shake the Bollywood box office, like they did in Tollywood with ‘Alludu Seenu’.

తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలోని మోస్ట్ టాలెంటెడ్ మ‌రియు స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రైన బెల్ల‌కొండ సాయి శ్రీ‌నివాస్ బాలీవుడ్ ఎంట్రీకి స‌ర్వం సిద్ద‌మైంది. ఫస్ట్ మూవీ 'అల్లుడు శ్రీను' నుంచి 'రాక్షసుడు' వరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ప్రతి సినిమా హిందీలో డబ్అయ్యి యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ దక్కించుకుంటున్న నేపథ్యంలో పాపుల‌ర్ ఫిలిం మేక‌ర్ డా. జయంతిలాల్ గ‌డ‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని బాలీవుడ్ లోకి గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం `ఛత్రపతి`. ఈ చిత్రం రీమేక్‌తో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు సాయి శ్రీనివాస్. 'అల్లుడు శ్రీను'తో సాయిని టాలీవుడ్ కి పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ ఇద్దరికీ ఇది తొలి హిందీ సినిమా కావడం విశేషం. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై డాక్టర్‌. జయంతిలాల్ గ‌డ‌ ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా..

పాపుల‌ర్ ఫిలిం మేక‌ర్ డాక్టర్‌. జయంతిలాల్ గ‌డ‌ మాట్లాడుతూ - `ఛ‌త్రపతి’ ఒక గొప్ప స్క్రిప్ట్. దానిని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి మాకు ఒక స్టార్‌ అవసరం. ఈ ప్రాజెక్ట్‌కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌. అలాగే రీమేక్‌లు తెరకెక్కించడంలో వి.వి.వినాయక్‌ ఎంతో నైపుణ్యం కనబరుస్తారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ విష‌యంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి జ‌న‌రేష‌న్స్‌కి తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేస్తున్నాం`` అన్నారు.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ - ``బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ‘ఛత్రపతి’ సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. పెన్‌ స్టూడియోస్‌, డాక్టర్‌. జయంతిలాల్ గారి‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. న‌న్ను టాలీవుడ్‌లో హీరోగా ప‌రిచ‌యం చేసిన వి.వి.వినాయక్ గారితో మ‌రోసారి క‌లిసి ప‌నిచేయ‌డం ఒక గొప్ప అవకాశం. ప్రభాస్ గారు ‌ పోషించిన పాత్రలో నటించడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నా’ అన్నారు.

మాస్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్‌, మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ రీమేక్ చిత్రం‌పై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబందించి ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

    
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved