pizza
రెండ‌వ షెడ్యూల్ లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్‌'
You are at idlebrain.com > news today >
Follow Us

10 April 2015
Hyderabad

బలుపు, పవర్ వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల త‌రువాత మాస్ మహరాజ్‌ రవితేజ, మిల్కి బ్యూటి త‌మ‌న్నా, స్మైలింగ్ సుంద‌రి రాశి ఖ‌న్నాలు జంట‌గా, రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌రువాత సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ఉత్త‌మాభిరుచి వున్న‌ చిత్రాల్ని అందించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు నుండి త‌దుప‌రి షెడ్యూల్ ని ప్రారంభించారు. హైద‌రాబాద్ లొని చిలుకూరు, రామెజిఫిల్మ్ సిటి మ‌రియు ప‌రిస‌ర ప్రాంతాల్లో మే 6 వ‌ర‌కూ షూటింగ్ జ‌రుపుకుంటుంది.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ.... మా బ్యాన‌ర్ లో మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా లు జంట‌గా నిర్మిస్తున్నా చిత్రం బెంగాల్ టైగ‌ర్. మా బ్యాన‌ర్ నుండి ప‌రిచ‌యమ‌య్యిన‌ సూప‌ర్ స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ద‌ర్శ‌కుడు. అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత బాలీవుడ్ న‌టుడు బోమ‌న్ ఇరాని మా ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి మా చిత్రంలో చేస్తున్నారు. బోమ‌న్ ఇరానితో పాటు రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు మెద‌టి షెడ్యూల్ లొ న‌టించారు. ఇప్ప‌డు జ‌రిగే షెడ్యూల్ ఏప్రిల్ 10 నుండి ప్రారంభ‌మైంది. హీరో ర‌వితేజ‌, హీరోయిన్స్ మ‌రియు ఇత‌ర తారాగాణం అంతా పాల్గోనే ఈ షెడ్యూల్ మే 6 వ‌ర‌కూ హైద‌రాబాద్ లొ చిలుకూరు, రామోజిఫిల్మ్ సిటి ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. అనుకున్న దానికంటే ఈ చిత్రం బాగా వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఏమి చెప్పాడో దాన్ని మించి తీస్తున్నాడు. ర‌వితేజ గారి ఎన‌ర్జిలెవెల్ ని మైండ్ లో పెట్టుకుని ఆయ‌న‌కున్న మాస్ ఇమేజ్ ని దృష్టిలొ పెట్టుకుని ఈ క‌థ చేశారు, ఈ చిత్రానికి యంగ్ ఎన‌ర్టిటిక్ టాలెంటెడ్ టీం తొ మ్యూజిక్ చేయిస్తున్నాము. ఈ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకునేలా తెర‌కెక్కిస్తున్న మా బెంగాల్ టైగ‌ర్ ని వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా సెప్టెంబ‌ర్ 17 న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము అని అన్నారు.

దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ... మాస్ మహరాజ్ రవితేజ గారి మాస్ ఇమేజ్ ని దృష్టిలొ పెట్టుకుని ఈ బెంగాల్ టైగ‌ర్ క‌థ రాశాను. ర‌వితేజ గారిని స్క్రీన్ మీద ఎలా ఆడియ‌న్స్ చూడాల‌నుకుంటారో అదే రేంజిలొ చిత్రాన్ని రూపోందిస్తున్నాము. ,సినిమాల మీద ఉత్త‌మాభిరుచున్న‌ నిర్మాత కె కె రాధామోహన్ గారు అందిస్తున్న స‌హ‌కారానికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఏవిష‌యంలో కూడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో బోమ‌న్ ఇరాని రెండ‌వ చిత్రంగా మా చిత్రం లో న‌టిస్తున్నారు. త‌మ‌న్నా, రాశిఖ‌న్నా ల ప్రాత్రలు కూడా చాలా బాగా వ‌చ్చాయి. ఈ రోజు ప్రారంభ‌మైన షెడ్యూల్ లొ హీరో, హీరోయిన్స్ తో పాటు కొంత‌మంది న‌టీనటులు పాల్గొంటారు. ఈ షెడ్యూల్ మే6 వ‌ర‌కూ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి,పృద్వి, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు ఈ షెడ్యూల్ లో న‌టిస్తున్నారు.

బ్యాన‌ర్‌: శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమోరా: సుంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్‌రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌,
నిర్మాత‌:కె.కె.రాథామెహ‌న్‌,
క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:సంప‌త్ నంది

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved