pizza
Bhale Bhale Magadivoy shoot complete
షూటింగ్‌ పూర్తిచేసుకున్న 'భలే భలే మగాడివోయ్'
You are at idlebrain.com > news today >
Follow Us

28 July 2015
Hyderabad

షూటింగ్‌ పూర్తిచేసుకున్న 'భలే భలే మగాడివోయ్'

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌. ఇటీవ‌లే గోవాలోని అందమైన లొకేషన్స్ లో ఓ పాట చిత్రీక‌రించారు. మ‌రో పాట‌ని హైద‌రాబాద్ లో చిత్రీక‌రించ‌టంతో టోట‌ల్ షూటింగ్ పూర్త‌యింది.ఈ పాటల‌కు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు.ఆడియోని అగ‌ష్టు మెద‌టి వారంలో విడుద‌ల చేసి అగ‌ష్టులోనే చిత్రాన్ని కూడా విడుద‌ల చేయ‌టానికి నిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: " భలే భలే మగాడివోయ్ నా కెరీర్ లో స్పెషల్ సినిమా. ఈ తరహా క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర. ద‌ర్శ‌కుడు మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌టంతో వెంట‌నే అంగీక‌రించ‌మే కాకుండా ఎక‌ధాటిగా షూటింగ్ చేస్తున్నాం.ఇటీవ‌లే గోవాలో , హైద‌రాబాద్ లో రెండు పాట‌లు చిత్రీకరణతో సినిమా క‌ప్లీట‌య్యింది. శేఖర్ మాస్టర్ నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. త‌క్కువ టైంలో ఈచిత్రం పూర్త‌యింది. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముర‌ళి శ‌ర్మ స‌ర్‌ప్రైజింగ్ పాత్ర‌లో అందిరిని ఆక‌ట్టుకుంటారు. అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations బ్యాన‌ర్ లో బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం చాలా హ్య‌పిగా వుంది. ఎక్క‌డా ఎటువంటి డిస్ట‌బెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. " అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: " రెగ్యులర్ సినిమాలతో పోల్చితే భలే భలే మగాడివోయ్ సినిమా కొత్తగా ఉంటుంది. ప్రతీ అంశాన్ని చాలా కేర్ ఫుల్ గా చిత్రీకరిస్తున్నాం. నాని, లావణ్య మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు, నాని,న‌రేష్,వెన్నెల కిషోర్ ల మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇటీవ‌లే గోవాలో పాట చిత్రీకరించాం. హైద‌రాబాద్ లో సెట్ సాంగ్ టైటిల్ సాంగ్ గా చిత్రిక‌రించాం, ఈ రెండు పాట‌లు శేఖ‌ర్ మాస్ట‌ర్ కోరియోగ్ర‌ఫి చేశారు. గోపిసుందర్ చక్కటి సంగీతం అందించారు. సినిమాకు ఈ పాటలు హైలైట్ కానున్నాయి. కెమెరా నిజార్ ష‌ఫి ప్ర‌తి ఫ్రేమ్ ని అందంగా చూపించారు. ముఖ్యంగా హీరో నాని, లావ‌ణ్య ని అత్యంత అందంగా చూపించారు. అలాగే ఆర్ట్ వ‌ర్క్ ర‌మ‌ణ వంక తో పాటు నా టెక్నిషియ‌న్స్ అంద‌రూ చాలా బాగా ప‌నిచేశారు. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అగ‌స్ట్ లో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. " అని అన్నారు

ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ "ఏక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. మారుతి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోత్త‌జోన‌ర్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ వాల్యూస్ తో గ్రాండియర్ గా చిత్రీకరిస్తున్నాం. గోవాలోని సూపర్బ్ లొకేషన్స్ లో , ఇక్క‌డ భారీ సెట్ లో సాంగ్స్ షూట్ చేశాం.దీంతో చిత్ర షూటింగ్ పూర్తయింది. త్వరలోనే భలే భలే మగాడివోయ్ ఆడియో రిలీజ్ చేస్తాం. గోపిసుంద‌ర్ అందించిన ఆడియో ఈ ఇయ‌ర్ లో వ‌న్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో గా నిలుస్తుంది. చిత్రం కూడా ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా వుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు లో విడుదల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము." .అని అన్నారు.

న‌టీన‌టులు..
నాని,
లావ‌ణ్య త్రిపాఠి,
ముర‌ళి శ‌ర్మ‌,
న‌రేష్‌,
సితార‌,
స్వ‌ప్న మాధురి,
శ్రీనివాస రెడ్డి,
వెన్నెల కిషోర్‌,
ప్ర‌వీణ్,
ష‌క‌ల‌క శంక‌ర్‌,
బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు..

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌,
పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను,
ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌,
ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి,
సంగీతం: గోపి సుంద‌ర్,
నిర్మాత:బ‌న్నివాసు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి


Bhale Bhale Magadivoy on the sets
copyright idlebrian.com
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved