pizza
Bharat Ane Nenu Spain schedule from 25 March
మార్చి 25 నుంచి స్పెయిన్‌ షెడ్యూల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 March 2018
Hyderabad

''మన తెలుగు సంవత్సరాది పండగ కళ ఉట్టిపడే పంచె కట్టుతో ఉన్న పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశాం. ప్రేక్షకులకు, అభిమానులకు మహేష్‌ కొత్త లుక్‌ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఓ పాట రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. భారీ టెంపుల్‌ సెట్‌లో 100 డాన్సర్లు, 1000 మందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్‌ లెవల్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నార. ఈనెల 25 నుంచి స్పెయిన్‌లో షెడ్యూల్‌ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. .

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ల తోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved