pizza

Bheemla Nayak date reconfirmed on 25 February
వెనకడుగు వేసేదే లేదంటున్న ‘భీమ్లా నాయక్’.. అనౌన్స్ చేసిన రోజే ఫిక్స్ !

You are at idlebrain.com > news today >
Follow Us

25 January 2022
Hyderabad

By taking various factors into account, the producer of Bheemla Nayak is planning to go ahead with the 25 February release. Though the current covid cases in Telugu states are high, the effect of it is almost minimal. There is ample awareness about covid and there is not much phobia about it. AP Government has imposed restrictions from 18 January onwards. There are chances that it might be lifted after 3rd of February.

Telugu movie lovers are having a huge appetite for big ticket films. Akhanda and Pushpa became huge hits as they are mass films featuring big actors. Next in line is going to be Bheemla Nayak as all the promos and songs have created a sensation all around. The dialogues and songs released so far have gone viral. Songs composed by Thaman have gone into the youth so much that most college events are being celebrated with Bheemla Nayak songs.

Prime Media - the USA & Canada distributor of the film has been given a go-ahead to do arrangements like booking theaters for 24 February 2022 premieres.

This film has Trivikram penning dialogues and screenplay. Bheemla Nayak is an official remake of Malayalam blockbuster Ayyappanum Koshiyum. Director Sagar K Chandra who delivered Appatlo Okadundevadu (2016) as his last theatrical release is coming back with this film. Incidentally Appatlo Okadundevadu has also dealt with the subject of naxalites. Suryadevara Naga Vamsi is producing this movie on Sithara Entertainments banner.

వెనకడుగు వేసేదే లేదంటున్న ‘భీమ్లా నాయక్’.. అనౌన్స్ చేసిన రోజే ఫిక్స్ !

మెగా క్యాంప్ హీరోలు మామూలు స్పీడులో లేరు. ఒక‌వైపు అల్లు అర్జున్ త‌గ్గేదే లే అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన స్టైల్లో ‘భీమ్లా నాయ‌క్‌’గా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయడానికి సిద్ధమైపోతున్నారు. నిజానికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమా RRR, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాల‌కు దారి ఇచ్చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ్ టీమ్‌. దీంతో ‘భీమ్లా నాయక్’ను శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు.

అయితే తాజాగా మ‌రోసారి ‘భీమ్లా నాయక్’ అనుకున్న తేదీకి రాబోదంటూ వార్త‌లు వినిపించసాగాయి. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఆ వార్త‌ల్లో నిజం లేదు. ‘భీమ్లా నాయక్’ ప్ర‌క‌టించిన‌ట్లే శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లవుతుంది. ఓవ‌ర్ సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈ వార్త‌ల‌ను తోసి పుచ్చేస్తున్నార‌ట‌. వారు ఓవ‌ర్ సీస్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చేయ‌బోతున్నార‌ట‌.

అలాగే మ‌రో వైపు కోవిడ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను తొల‌గించే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తుంద‌ని కూడా స‌మాచారం. అల్లు అర్జున్ ‘పుష్ప’ త‌ర్వాత మ‌రో స్టార్ హీరో మూవీ ఏదీ థియేట‌ర్స్‌కు రాలేదు. సినీ ప్రేమికులు, ప‌వ‌ర్ స్టార్‌, మెగా ఫ్యాన్స్ ఆతృత‌గా ‘భీమ్లా నాయక్’ కోసం విడుద‌ల కోసం వేచి చూస్తున్నారు. ఇది వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌ల‌న్నింటికీ అద్భుత‌మైన స్పంద‌న చ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చార‌ని చెప్ప‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. అంచ‌నాల‌కు ధీటుగా ప‌వ‌ర్ స్టార్ త‌న ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ ధీమాగాఉన్నారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved