08 June 2016
Hyderabad
తెలుగు సినిమా పరిశ్రమలో కళా దర్శకుడిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి చంటి అడ్డాల. నిర్మాణం మీద ఉన్న ప్రీతితో ఆయన వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే త్వరలో మరో సినిమాను మొదలుపెట్టనున్నారు. గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
Chanti Addala interview gallery |
|
|
|
చంటి అడ్డాల మాట్లాడుతూ ``ఓ స్టార్ హీరోతో డిసెంబర్‌లోగానీ, జనవరిలోగానీ సినిమాను మొదలుపెడతాం. ఎవరితో, ఏంటి అనేది వారే ప్రకటిస్తారు. సీనియర్ నరేశ్ కుమారుడు నవీన్ విజయకృష్ణతో తీస్తున్న సినిమాను వాళ్లే విడుదల చేస్తామన్నారు. అందువల్ల ఇప్పుడు పెద్ద హీరో ప్రాజెక్ట్ మీద దృష్టి పెడుతున్నాను. ఒకప్పుడు కథ గురించి ఆలోచించి, కథలు సిద్ధం చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు కథల కన్నా, కాంబినేషన్లకు విలువ పెరుగుతోంది. చిన్న వాళ్లతో సినిమాలు చేస్తామంటే వడ్డీలకు ఇచ్చేవారు కూడా ముందుకు రావడం లేదు. అదే మంచి కాంబినేషన్ తో సినిమాలు చేస్తామంటే చాలా మంది ముందుకొస్తున్నారు. ఇప్పుడున్నవి కథలకు రోజులు కాదు. ఖర్చీఫ్ కు రోజులు. పూర్తిగా చిన్న వాళ్లతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగే ఆలోచన లేదు. భారీ ప్రాజెక్టులు చేస్తూ అప్పుడప్పుడూ మంచి కథలతో చిన్న సినిమాలను చేయాలని ఉంది. ఆర్ట్ డైరక్టర్‌గా ఉన్నప్పుడే చాలా సుఖంగా ఉండేది. కాకపోతే సినిమా తప్ప ఇంకేమీ చేయడం తెలియని వ్యక్తిని కాబట్టి ఇప్పుడు సినిమాలను తీస్తున్నాను. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆర్ట్ డైరక్షన్ కాస్త సులువుగానే ఉంది. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్‌లు వేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా వెసులుబాటు కనిపిస్తోంది. మోడళ్లు కావాలన్నా.. నెట్లో బోలెడన్ని డిజైన్లు కనువిందు చేస్తున్నాయి`` అని చెప్పారు.