pizza
Sundeep Kishan Birthday (7 May) interview
కథ నచ్చితే నెగటివ్ పాత్రలైనా చేస్తాను – సందీప్ కిషన్
You are at idlebrain.com > news today >
Follow Us

06 May 2016
Hyderaba
d

ప్రస్థానం సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ నటించి మెప్పించిన సందీప్ కిషన్, తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, రా రా కృష్ణయ్య, బీరువా, రన్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యంగ్ హీరో పుట్టినరోజు మే 7న. ప్రస్తుతం ఒక్క అమ్మాయి తప్ప చిత్రంలో నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ...

ఒక్క అమ్మాయి తప్ప చిత్రంలో ఎలాంటి క్యారెక్టర్ చేశారు?
చాలా ఎనర్జిటిక్, ఫన్ గోయింగ్ పాత్రలో కనపడతాను. చదువును మధ్యలో వదిలేసినా తన తెలివితో ఎదుటివారి క్యారెక్టర్ ను చదివే క్యారెక్టర్.

ఒక్క అమ్మాయి తప్ప ఎలాంటి సినిమా?
ఈ సినిమాలో ట్రాఫిక్ జామ్ అనేది మెయిన్ పాయింట్. సినిమాలో 60 శాతం చిత్రీకరణ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై, ఇద్దరి ప్రేమికులు మధ్య జరుగుతుంది. వారు తమ సమస్యలను ఎలా అధిగమించారనేదే కథ. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. అయినా కొత్త పాయింట్ తో నడిచే సినిమా. పెద్ద స్కేల్ మూవీ.

Sundeep Kishan interview gallery

డైరెక్టర్ రాజసింహతో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్?
నేను ఇప్పటి వరకు పనిచేసిన దర్శకుల్లో రాజసింహ బెస్ట్ డైరెక్టర్. ఈ సినిమాలో ఆరవైశాతం సినిమా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై జరిగే కథ. నిజంగా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై సినిమా షూటింగ్ అంటే ప్రాక్టికల్ గా చాలా కష్టం. అలాంటి పాయింట్ ను ఆడియెన్స్  తో నమ్మించాలంటే చాలా కష్టం. మూడేళ్లు కష్టపడితే ఆ విజన్ వచ్చింది.  అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి సినిమాను చిత్రీకరించాం. సిజీ వర్క్ తో ఓరిజినల్ లుక్ తేవడానికి ప్రయత్నిస్తునాం.

నెగటివ్ రోల్స్ చేస్తాను..?
కథ నచ్చితే నెగటివ్ రోల్స్ ఉన్న పాత్రలు చేయడానికి నేను రెడీయే.

కృష్ణవంశీతో పనిచేయడం ఎలాంటి అనుభూతినిస్తుంది?
ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి కృష్ణవంశీగారితో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. సినిమా గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు.

తదుపరి చిత్రాలు?
కృష్ణవంశీగారి దర్శకత్వంలో నక్షత్రం సినిమా చేస్తున్నాను. అలాగే నేను, లావణ్య త్రిపాఠి కలిసి మయావన్ సినిమా చేస్తున్నాను. అలే తమిళంలో పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాను.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved