pizza
Vijay Devarakonda birthday (9 May) interview
నేను మారుతూనే ఉన్నా - విజ‌య్ దేవ‌ర‌కొండ‌
You are at idlebrain.com > news today >
Follow Us

8 May 2018
Hyderabad

`ఎవ‌రే సుబ్ర‌హ్మ‌ణ్యం` స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ కొత్త న‌టుడు. కానీ `అర్జున్ రెడ్డి` త‌ర్వాత హిట్ ఉన్న హీరో. తాజాగా చేతినిండా సినిమాలున్న విజ‌య్ దేవ‌ర‌కొండ బుధ‌వారం పుట్టిన‌రోజును నిర్వ‌హించుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విష‌యాలు...

* సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన‌ప్పుడు ఉన్న‌ట్టే ఉన్నారా? మీలో ఏమైనా మార్పులు వ‌చ్చాయా?
- నా జీవిత‌మంతా నేను మారుతూనే ఉన్నాను. మ‌న ప‌రిస‌రాలు, మ‌నం క‌లిసే వ్య‌క్తులు.. ఇలా మారుతూ ఉన్నాం. ప‌దిలో ఉన్నట్టు డిగ్రీలో లేను. డిగ్రీలో ఉన్న‌ట్టు స్ట్ర‌గ్లింగ్లో ఉన్న‌ట్టు లేను. అప్పుడున్న‌ట్టు ఇప్పుడు లేను. చేంజ్ జ‌రిగింది. జరుగుతూనే ఉంది.

* `అర్జున్ రెడ్డి` అంత పెద్ద హిట్ అవుతుంద‌ని ఊహించారా?
- హిట్ అవుతుంద‌ని అనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్‌ని కోరుకోలేదు.

* మ‌రి బ‌ర్త్ డే విష‌స్‌ని ఎందుకు కోరుకోరు?
- నేను పుట్టాలంటే పుట్టలేదు. మా అమ్మానాన్న‌లు కావాలనుకుంటే పుట్టాను అంతే. అందుకు నాకు పుట్టిన‌రోజు విష‌స్ ఎందుకు? దానికి బ‌దులు నేను ఏదైనా సాధించిన‌ప్పుడు ఎవ‌రైనా మెచ్చుకుంటూ విష్ చేస్తే ఆనందంగా ఉంటాను.

* ప్ర‌జ‌ల అటెన్ష‌న్‌ని కోరుకుంటారా?
- లేదండీ. నాకు ఏమి తోచిందో, ఏం చెప్పాల‌నుకుంటున్నానో అదే మాట్లాడుతాను. అంతేగానీ ఎవ‌రి అటన్ష‌నో కావాల‌ని కోరుకోను. నా ప‌నులు నేను చేస్తున్నానంతే.

* మీరు విమ‌ర్శ‌కు ఓకేనా?
- వీడు ఫాల్తు యాక్ట‌ర్ అంటే ఓకే, అలా కాకుండా `వీడు ఇలాంటి సినిమా ఎందుకు చేసిండు` అని అంటే నాకు కాలుతుంది. అభిప్రాయాలు చెప్ప‌డాన్ని నేనెప్పుడూ కాదు అని అన‌ను, ఇలా ఎందుకు చేశావ‌ని అడిగితే నాకు న‌చ్చ‌దు. నేను కూడా అభిప్రాయాలు చెప్తాను. స‌చిన్ గురించి ఎన్నో సార్లు చెప్పాను. కానీ ఒక‌ప్ప‌టితో పోల్చుకుంటే ఇప్పుడు సోష‌ల్ మీడియా చాలా పెరిగింది. కాబ‌ట్టి ఇప్పుడు అభిప్రాయాల‌ను కాస్త ఆలోచించి చెప్పాలి.

* కొన్ని మాట‌లు మీరు రెచ్చ‌గొట్టిన‌ట్టు చెబుతుంటారుగా సోష‌ల్ మీడియాలో?
- అంటే కొన్నిసార్లు త‌ప్ప‌దు. అంద‌రూ అనుకుంటున్న‌ట్టు నేను రెచ్చ‌గొట్ట‌ను. నేను ఏమైనా చేస్తే, దాని ఫ‌లితాల‌ను కూడా ఆలోచిస్తాను. కాబ‌ట్టి ఆలోచించ‌కుండా ఏమీ చేయ‌ను.

* `మ‌హాన‌టి`లో ప‌నిచేయ‌డం గురించి చెప్పండి?
- అందులో విజ‌య్ ఆంటోనీ అనే పాత్ర చేశా. ఆ పాత్ర త‌ప్ప‌కుండా అంద‌రికీ నచ్చుతుంది.

* ఈ అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- ఒక రోజు షూటింగ్‌లో ఉన్నా. గీతా ఆర్ట్స్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఆ స‌మ‌యంలో నాకు స్వ‌ప్న ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పింది. నేను వివ‌రాలేమీ అడ‌క్కుండా, ఓకే చెప్పేశాను. ఎందుకంటే నాకు స్వ‌ప్న‌, నాగి ఇద్ద‌రూ బాగా ఫ్రెండ్స్.

* ముందు మిమ్మ‌ల్ని జెమిని గ‌ణేశ‌న్ పాత్ర చేయ‌మ‌న్నార‌ట క‌దా?
- అవును. ఎందుకంటే అప్పుడు దుల్క‌ర్ డేట్లు అడ్జ‌స్ట్ చేయ‌డం క‌ష్ట‌మైంది. కానీ త‌ర్వాత కుదిరింది. త‌న‌కి నిజంగా ప్రాబ్ల‌మ్ ఉంద‌ని తెలిసిన‌ప్పుడు నేను చేయ‌డానికి ముందుకు వ‌చ్చాను. త‌ర్వాత ఎలాగో కుదిరింది. చేసేశాడు. నేను విజ‌య్ ఆంటోనీ పాత్ర‌కు ఫిక్స‌యిపోయాను.

* మీ `టాక్సీవాలా` సినిమా గురించి చెప్పండి?
- `అర్జున్ రెడ్డి` త‌ర్వాత న‌న్ను చూడాలంటే `ట్యాక్సీవాలా`లోనే. అంత బాగా ఉంటుంది ఆ పాత్ర‌. అది ఫ‌న్ థ్రిల్ల‌ర్‌. ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా చేస్తున్నా. స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించానన్న‌ది హ్యాపీ.

interview gallery* నాగ్ అశ్విన్‌తో మ‌రోసారి చేయ‌డం గురించి?
- చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే న‌న్ను న‌టుడిగా షేప‌ప్ చేసిన వారిలో నాగి కూడా ఒక‌డు.

* మీ పాత్ర ఎంత సేపు ఉంటుంది?
- చాలా చాలా త‌క్కువ సేపు ఉంటుంది. `సావిత్రి` జీవితం గురించి రీసెర్చ్ చేసే టీమ్‌గా క‌నిపిస్తాను. `మ‌హాన‌టి`లో న‌న్ను చూద్దామ‌ని ఎవ‌రైనా వ‌స్తే అది ఫూలిష్‌నెస్ అని అర్థం. ఆ సినిమాను సావిత్రిగారిని చూడ‌టానికి వెళ్లాలి.

* స‌మంత‌తో ప‌నిచేయ‌డం గురించి?
- నేను చాలా విష‌యాల గురించి క‌నీసం ఊహించ‌ను. స‌మంత‌తో ప‌నిచేయ‌డం కూడా అలాంటిదే. ఎప్పుడూ అస‌లు ఆ ఊహేలేదు. షూటింగ్ తొలిరోజు శామ్ అర్జున్ రెడ్డి సినిమా చూశాన‌ని చెప్పింది. అర్జున్ రెడ్డి చూసి చై, శామ్ అంద‌రూ అంత‌కు ముందే ఫోన్లు చేసి మాట్లాడారు. శామ్ నాకు న‌ట‌న‌లో సీనియ‌రే. కానీ ఎక్క‌డా సీనియ‌ర్‌లాగా ఆమె ప్ర‌వ‌ర్తించ‌లేదు.

* హిందీ సినిమాలు చేసే ఆలోచ‌న ఉందా?
- లేదండీ. తెలుగు, త‌మిళ్‌కే చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉంటాయ‌ని చేస్తున్నాను. అంతేగానీ లేకుంటే త‌మిళ్‌లో కూడా చేసి ఉండ‌ను. ఇప్పుడు తెలుగులో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అందుకే హిందీకి వెళ్ల‌ను.

* నోటాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- అగ్రెసివ్ పొలిటీషియ‌న్‌గా క‌నిపిస్తాను. స‌బ్జెక్ట్ చాలా కొత్త‌గా ఉంటుంది. నేను చాలా ఎగ్జ‌యిట్ అయ్యా.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved