pizza
Dasari Narayana Rao Birthday interview 2016
మహాభారతం తీయాలన్నది నా చిరకాల కోరిక - దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు
You are at idlebrain.com > news today >
Follow Us

03 May 2016
Hyderaba
d

దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు.. తెలుగు సినిమా పెద్ద దిక్కు, ఆయన పేరు తెలియని తెలుగువారు లేరు. ఆయన చేయని సినిమా లేదు., ఆయన టచ్‌ చేయని కథాంశం లేదు..., రోజుకు18 గంటు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలుసూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు.  ఎన్నో సందేశాత్మక చిత్రాలుమరెన్నో వినోదాత్మక చిత్రాలు చేశారు.

స్టార్‌ హీరోతో చేసినాకొత్త నటీనటుతో చేసినా కథనే నమ్ముకొనికథే హీరో అనుకొని సినిమాలు చేస్తూ ఎన్నో శతదినోత్సవ చిత్రాలురజతోత్సవ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారం భించి తాత మనవడుతో దర్శకుడుగా అవతరించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనుడు. గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకొని ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ సాధించని రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలుదర్శకుడుగా 40సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకున్నారు.  దర్శకుడిగా తనకు ఎవరూ సాటిరారు అనిపించుకుని తెలుగు సినిమా చరిత్రలో ఆయన ముద్రను వేశారు. తెలుగు చలన చిత్రసీమలో అందరూ ఆయన్ను అప్యాయంగా గురువుగారు అని పిలుచుకుంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాంటూ అండగా నిలబడే నాయకుడు. నిర్మాత కష్టం తెలిసిన నిర్మాత. మాటతోపాటతో సినిమాకు ప్రాణం పోసిన తిరుగులేని రచయిత. ఎంతోమంది నటీనటులుటెక్నిషియన్స్‌ కి ప్రాణం పోసిన బ్రహ్మ. ఎందరో దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మేటి దర్శకుడు. అన్నింటినీ మించి గొప్ప మార్గదర్శకుడు. తెలుగు చిత్రాలను తన దర్శకత్వ ప్రతిభతో కొత్త పుంతలు తొక్కించిన ధీశాలి. దర్శకుడే సినిమాకి కెప్టెన్‌ అనితనే సినిమాకి తన ఆలోచనతో ప్రాణం పోస్తాడని చెప్పిన దర్శక రత్న డా॥ దాసరి నారాయణరావు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ దిగ్ధర్శకుడు. దర్శకులకు పాఠాలు చెప్పిన గురువు. హీరో స్థాయిలో దర్శకులకు స్టార్‌ డమ్‌ తీసుకొచ్చిన స్టార్‌ డైరెక్టర్‌. మే 4న దర్శకరత్న డా.దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో....

రెండు విశేషాలు....
సినిమాకు సంబంధించి రెండు విశేషాలున్నాయి. మొదటిది పవన్‌కల్యాణ్‌ సినిమా చేస్తుండటం ఒక విషయంఆ చిత్రానికి దర్శకుడెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అయితే ఆ చిత్రం యొక్క స్క్రిప్ట్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది. రెండోది నాడైరెక్షన్‌లో ఓ చిత్రం ఉంటుంది. మరో డైరెక్టర్‌తో అంతా కొత్తవాళ్లతో మరో చిత్రం ఉంటుంది. నేను చేసేది లవ్‌స్టోరీ. వ్‌స్టోరీ అంటే మనిషి కనిపించగానే ఐ లవ్‌ యూ అని చెప్పే కథ కాదు. అయితే ఈ కథ ఇప్పుడు రాసింది కాదు. రామానాయుడుగారున్నప్పుడు రాసింది. కానీ ఆయన అనారోగ్య కారణాల వల్ల చేయలేకోపోయాం. కొత్త దర్శకులు ఎవరైనా కథతో వస్తే హ్యాపీ.

చిరకాల కోరిక...
 అత్యద్భుతంగా మహాభారతం తీయాలన్నది నా చిరకాల కోరిక. రెండు పార్టుల స్క్రిప్టు తయారైంది. మూడోపార్ట్‌ రెడీ అవుతోంది. ఈలోగా మరొకరు మహాభారతం అనౌన్స్‌ చేశారు. కానీ నా తరహాలో నా సినిమా ఉంటుంది. డైరెక్టర్‌గా మహాభారతమే నా చివరి సినిమా. పౌరాణిక సినిమాలకు తగిన ఆర్టిస్టు మనకున్నారు. లేరు అనడానికి లేదు.

గ్యాప్‌ తీసుకోవడానికి కారణం....
పరమవీరచక్ర చిత్రంఇటీవల చేసిన ఎర్రబస్సు చిత్రాలు డిజప్పాయింట్‌ చేయడం. ఇవాళ మంచి సినిమాు చాలా తక్కువగా వస్తున్నాయి. లవ్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. లవ్‌ సినిమా అంటే తల్లిదండ్రులను తిట్టడంవెటకారంగా మాట్లాడటం జరుగుతోంది. ఆ స్థాయిలో నేను తీయలేను. అయితే అప్పుడప్పుడు ఊపిరిమనంకళ్యాణప్రాప్తిరస్తు వంటి సినిమాు కూడా వస్తున్నాయి. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనిని బట్టి ట్రెండ్‌లో మార్పు వచ్చిందనుకోవాలి.

రెమ్యూనరేషన్స్‌ ఇచ్చేయమనటం సరికాదు
సినిమా నష్టపోతే ఆ నిర్మాతకు హీరో కానీదర్శకుడు కానీ తిరిగి డేట్స్‌ ఇచ్చి సహాయం చేయడం గతంలో ఉండేది. కానీ దర్శకున్ని కానీహీరోను కానీ రెమ్యూనరేషన్స్‌ తిరిగి ఇచ్చేయమనటం కరెక్ట్‌ కాదు. 20 నుండి 30 వరకు నష్టపోతే ఎవరూ చేసేదేమీలేదు. నెక్ట్స్‌ సినిమా ఇచ్చి ఎడ్జస్ట్‌ చేయడం తప్పు కూడా కాదు. అయితే రజనీకాంత్‌అల్లు అరవింద్‌పవన్‌ కల్యాణ్‌శ్రీనువైట్ల,వినాయక్‌మహేష్‌బాబు వంటి కొందరు తమ సినిమాలు ఏదైనా బాగా నష్టపోయినపుడు తమ రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ నేను డైరెక్టర్‌ను కదాహీరోను కదా నన్ను అడగటం ఏంటి అనడం కూడా సరికాదు.

అటువంటి నిర్మాతలు వల్ల ఇండస్ట్రీ పాడవుతుంది...
కొంత మంది నిర్మాతలు ఏమీ తెలియకుండానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. దాని వల్ల ఇండస్ట్రీ పాడవుతుంది. రెండు, మూడు ఇతర ప్రొడక్షన్ సినిమాలకు విజిటర్స్ గా ఉంటే కొంత అవగాహన ఏర్పడుతుంది.

తెలంగాణ ప్రభుత్వ కమిటీ...
తెంగాణ ప్రభుత్వం చిన్న సినిమా సమస్యకు స్పందించి ఒక కమిటీ వేసింది. ఇది మంచి  పని. హైదరాబాద్‌ను సినీ హబ్‌గా చేయాన్నది ప్రభుత్వ ఆలోచన. కేవం తెలుగు సినిమాలు మాత్రమేగాక ఇతర భాషా చిత్రాలు తమిళకన్నడమళయాహిందీ చిత్రాలతో పాటు బాలీవుడ్‌హాలీవుడ్‌ చిత్రాల షూటింగ్స్‌ కూడా ఇక్కడ జరగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి ఆలోచన. అందుకే 2వేల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. చిన్న సినిమాలకు సంబంధించి థియేటర్ల సమస్య ఉంది. ఇందుకోసమే ప్రభుత్వం కమిటీ వేసింది. ఇందుకు సలహా ఇవ్వటం కూడా జరిగింది. మల్టీప్లెక్స్ లో ఓ ఆటను చిన్న సినిమాకు కేటాయించడం వల్ల లాభాలను తెలియజేశాం. సింగిల్ విండో పద్ధతిలో లోకేషన్ పర్మిషన్స్, ఆన్ లైన్ టికెటింగ్ పద్ధతులుండాలని సూచించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి జరగాలి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved