pizza
Lakshmi Manchu Birthday 2016 Interview (Telugu)
అంత‌కు ముందు అస‌లెలా ఉన్నానా అని అనిపిస్తోంది
You are at idlebrain.com > news today >
Follow Us

8 October 2016
Hyderaba
d


ల‌క్ష్మీ మంచు బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. టీవీ వ్యాఖ్యాత‌గా, న‌టిగా, నిర్మాత‌గా, ఇప్పుడు చంటిపాప‌కు త‌ల్లిగా బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌ను క‌న‌బ‌రుస్తోంది. శ‌నివారం పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ఆమె విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు..

* ఎలా ఉంది లైఫ్‌?
- చాలా బిజీగా, ఇష్టంగా ఉంది.

* ఓ వైపు హెక్టిక్ షెడ్యూల్స్. అయినా వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. ఏంటి సీక్రెట్‌?
- ఎప్పుడు ఎంత, ఏం తినాలో తెలుసుకుంటే చాలు. ఎప్పుడైనా కాసింత ఎక్కువ తిన్న‌ట్టు అనిపిస్తే వెంట‌నే జిమ్ చేస్తుంటా.

* ఇప్పుడు చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?
- ల‌క్ష్మీ బాంబ్ షూటింగ్ పూర్త‌యింది. చాలా మంచి సినిమా. నాలో వేరియ‌స్ షేడ్స్ ని చూపిస్తుంది. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్ మిక్స్ అయిన సినిమా.

* టైటిల్ మీ కోస‌మే పెట్టారా?
- నేనూ మొద‌ట అదే అనుకున్నా. కానీ ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆ టైటిల్ సినిమాకు యాప్ట్ అని ప‌దే ప‌దే చెప్పారు. నాక్కూడా క‌రెక్టే అనిపించింది.

Lakshmi Manchu Birthday interview

* రెస్పాన్స్ ఎలా ఉంది?
- టైటిల్ విన‌గానే చాలా మంది ఫోన్లు చేసి `ఇది క‌దా క‌రెక్ట్ టైటిల్‌` అని మెచ్చుకున్నారు.

* మేముసైతం గురించి చెప్పండి?
- ఒక్క ప్ర‌భాస్‌ని త‌ప్ప మిగిలిన వాళ్లంద‌రినీ నేను మేముసైతం కోసం అడిగేశాం. కొంత‌మంది స్పందించ‌లేదు. చాలా మంది స్పందించి వ‌స్తున్నారు.

* ఇలాంటి బ‌రువైన షోలు చేస్తున్న‌ప్పుడు ఏమనిపిస్తుంది?
- కొన్నిసార్లు కొంద‌రి క‌థ‌లు విన్నాక నిద్ర‌ప‌ట్ట‌కుండా దాని గురించే ఆలోచిస్తుంటాను. నా మీద అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇంత‌మందికి ఎలా సాయ‌ప‌డ‌గ‌ల‌ను అని ఆలోచిస్తుంటా. వాళ్లంద‌రికీ నేను అమ్మ‌లాగా ఫీల‌వుతుంటా.

* సినిమాల నిర్మాణం ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
- ఇత‌ర నిర్మాత‌లు న‌న్ను పిలిచి డ‌బ్బులిచ్చి సినిమాలు తీస్తుంటే బావుంది. న‌న్ను ఎగ్జ‌యిట్ చేసేంత గొప్ప స్క్రిప్ట్ వ‌స్తే త‌ప్ప‌కుండా నేను సినిమా చేస్తా.

* మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా?
- నాన్న‌గారితో చేయాలి. పోటాపోటీగా ఉండేలా చేయాలి. మంచి క‌థ‌లు రావ‌డం లేదు. వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా.

* ఈ పుట్టిన‌రోజును ఎలా జ‌రుపుకుంటున్నారు?
- నా కూతురు, మా నాన్న‌, అమ్మ‌, మేన‌కోడ‌ళ్లు.. అంద‌రితో క‌లిసి జ‌రుపుకుంటున్నా. నా జీవితంలోకి పిల్ల‌లు వ‌స్తే టైమ్ కేటాయించ‌గ‌ల‌నా? అని అప్పుడు ఆలోచించేదాన్ని. కానీ విద్యా నిర్వాణ పుట్టిన త‌ర్వాత అస‌లు ఈ పాప లేకుండా అన్నాళ్లు ఎలా గ‌డిపాను అని ఆలోచిస్తున్నా. అంత మార్పు వ‌చ్చింది నాలో.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved