pizza
Producer Bekkam Venugopal Birthday interview 2017
నిర్మాతగా మంచి సినిమాలు చేయాలనే బాధ్యతతో పనిచేస్తున్నాను - బెక్కం వేణుగోపాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 April 2017
Hyderabad

మంచి కుటుంబ క‌థా చిత్రాల‌కు కేరాఫ్‌గా మారాల‌నే ఉద్దేశంతో లక్కీ మీడియా అనే బ్యానర్‌ను స్టార్ట్ చేశాను. తొలి చిత్రం `టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా` సినిమా నుండి నేటి సినిమా చూపిస్త మావ వ‌ర‌కు స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌గా రాణించిన బెక్కం వేణుగోపాల్ గ‌త ఏడాది విడుద‌లైన నేను లోక‌ల్ సినిమా నిర్మాణంలో భాగ‌మై మంచి స‌క్సెస్‌ను అందుకున్నారు. ఏప్రిల్ 27న బెక్కం వేణుగోపాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న పాత్రికేయుల‌తో త‌న సినీ జ‌ర్నీ విశేషాలను తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా...

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``లక్కీ మీడియా సంస్థను 2006లో 'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో ప్రారంభించాను. నిర్మాతగా మారిన తర్వాత నా 12వ పుట్టినరోజు ఇది. ఇప్పటికి 9 సినిమాలు చేశాను. మరికొన్ని సినిమాలు ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నాయి. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయ్యాయి. కెమెరా అసిస్టెంట్‌గా స్టార్ట్‌ అయిన నేను ప్రొడక్షన్‌ మేనేజర్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా స్టార్ట్‌ అయిన నేను జెమినిటీవీలో చేరాను. అక్కడ నుండి హీరో శివాజీ, నేను ఇద్దరం మంచి స్నేహితులం. నా నెక్స్‌ట్‌ స్టేజ్‌ ఏంటని నేను అనుకున్నప్పుడు శివాజీయే నువ్వు నిర్మాతవి కావాలని అన్నాడు. తను అప్పుడు హీరోగా మంచి రేంజ్‌లో ఉన్నాడు. తనే అన్నీ దగ్గరుండి చూసుకుని లక్కీ మీడియా బ్యానర్‌ను స్టార్ట్‌ చేశాం. ఆరోజు నుండి మొదలైన నా ప్రయాణంలో సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ వచ్చాను. మధ్యలో మంచి కథలతో సినిమాలు చేయాలనే గ్యాప్‌ తీసుకున్నాను. నేను చేసిన ప్రతి సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలనే చేశాను. అన్నీ సినిమాలు మంచి ఆదరణనే పొందాయి. రెండు మూడేళ్ళ నుండి 'సినిమా చూపిస్త మావ', 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌' సినిమాలు మంచి విజయాలను సాధించాయి. సినిమా చూపిస్త మావ సినిమా చూసిన దిల్‌రాజుగారు అదే టీంకు సపోర్ట్‌ చేస్తూ నాకు కొన్ని బాధ్యతలు అప్పగించి చేసిన సినిమాయే 'నేను లోకల్‌'. పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది.

Producer Bekkam Venugopal interview gallery

భవిష్యత్‌లో నేను చేయబోయే సినిమాల విషయంలో నాకెంతో బలాన్నిచ్చింది. దిల్‌రాజుగారి సలహాలు తీసుకుంటూ ఉన్నాను. కథలను ఎలా సెలక్ట్‌ చేసుకోవాలి, ఎలాంటి సినిమాలు చేయాలనే చాలా విషయాలను ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాను. ఆయనలాంటి వ్యక్తులతో పనిచేయడం నా కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. నేను లోకల్‌ టీంతోనే నెక్స్‌ట్‌ సినిమా చేయబోతున్నాం. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్‌ కాలేదు అయితే అనుకున్న పాయింట్‌ రాజుగారికి కూడా నచ్చింది. కథను తయారుచేస్తున్నాం. అలాగే నా బ్యానర్‌లో రెండు సినిమాలను కొత్త దర్శకులతో చేస్తున్నాం. ఒక దర్శకుడు పేరు హర్ష. హ్యాపీడేస్‌, కేరింత స్టయిల్లో ఉండే సినిమా. నలుగురు కుర్రాళ్ళ జీవితంతో చేస్తున్న సినిమా. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నేను లోకల్‌ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నరేష్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయబోతున్నాం. ఇంకా ప్రొడక్షన్‌ దశలోనే ఉన్నాం. శివాజీ కోసం ఒక మంచి కథను తయారు చేసే పనిలో ఉన్నాం. తనను కొత్తగా ప్రెజంట్‌ చేసే ఆలోచనలో ఉన్నాం. నిర్మాతగా మంచి సినిమాలు చేయాలనే బాధ్యతతో పనిచేస్తున్నాను. అందువల్ల సక్సెస్‌రేట్‌ బాగానే ఉంది. మంచి కథను జడ్జ్‌ చేయగలను. నా స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ కథను చెప్పి అందరి నిర్ణయం తీసుకునే సినిమాలు చేస్తాను. ముఖ్యంగా నేను కథనే బాగా నమ్ముతాను'' అన్నారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved