pizza
Dil Raju Birthday interview (18 December)
నిర్మాత‌ మాయ‌లో బ్ర‌త‌కాల్సిన అవ‌స‌రం లేదు - దిల్‌రాజు
You are at idlebrain.com > news today >
Follow Us

17 December 2017
Hyderabad

శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ అధినేత దిల్‌రాజును అంద‌రూ హిట్ చిత్రాల నిర్మాత అని పిలుస్తుంటారు. ఎందుకంటే నిర్మాత‌గా ఆయ‌న 28 సినిమాలు చేస్తే అందులో 22 సినిమాలు స‌క్సెస్ కావ‌డం చాలా గొప్ప విష‌యం. మ‌రో నిర్మాతకు ఇలాంటి స‌క్సెస్ ట్రాక్ ఇప్ప‌టి వ‌ర‌కు లేదు. ఈ స‌క్సెస్‌ఫుల్ నిర్మాత పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 18. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

రెండింటికీ బాధ్య‌త నాదే..
- ఇది 47వ పుట్టిన‌రోజు. ఈ ఏడాది నా జీవితంలో పాజిటివ్ ఉంది. నెగ‌టివ్ కూడా ఉంది. ఏడాది విడుద‌లైన ఐదు సినిమాలు సూప‌ర్‌హిట్స్ అయితే..డ‌బుల్ హ్యాట్రిక్‌కు సిద్ధ‌మ‌వుతున్నాం. ఇక నెగ‌టివ్ అంటే నా శ్రీమ‌తి ప‌ర‌మ‌ప‌దించ‌డం. నాకు చాలా బాధ క‌లిగించిన విష‌యం. ఇలా రెండు విష‌యాలను ఈ ఏడాది నేను ఫేస్ చేశాను. నేను నిర్మాతగా 28 సినిమాలు చేస్తే అందులో 22 సినిమాలు స‌క్సెస్ కావ‌డం గొప్ప విష‌యం. ఇక డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఈ ఏడాది నాకు పెద్ద‌గా ఏదీ క‌లిసి రాలేదు. 1999లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స్టార్ట్ చేసిన త‌ర్వాత డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఇంత న‌ష్టాల‌ను నేను ఎప్పుడూ చూడ‌లేదు. నిర్మాత‌గా మాత్రం స‌క్సెస్ సాధించాను. స‌క్సెస్‌ను తీసుకున్న‌ప్పుడు, ఫెయిల్యూర్‌ను కూడా స్వీక‌రించాలి. డిస్ట్రిబ్యూష‌న్ చేసే స‌మ‌యంలో కొన్ని ఎమోష‌న్స్ వ‌ల్ల‌, క‌మిట్ మెంట్స్ వల్ల నష్టాల‌ను చూశాను.

ఫెయిల్యూర్ అనే దర్శ‌కుడికే చెందదు..
- స‌క్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక ద‌ర్శ‌కుడికే చెందదు. ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడిగా చేసిన తొలి చిత్రం ఓ మై ఫ్రెండ్ పెద్ద స‌క్సెస్ కాలేదు. ఆ చిత్రాన్ని ఓ ఎక్స్‌పెరిమెంట్ మూవీగా చేద్దామ‌ని అనుకున్నాం. ముందు అనుకున్న బ‌డ్జెట్ నాలుగు కోట్లు త‌ర్వాత సినిమాలోకి సిద్ధార్థ్‌తో పాటు ఇద్ద‌రు స్టార్ హీరోయిన్స్ వ‌చ్చి చేరారు. దాని వ‌ల్ల సినిమా స్వ‌రూపం మేం ఏదైతే అనుకున్నామో అది మారిపోయింది. అలాగే కృష్ణాష్ట‌మి సినిమా విష‌యంలో కూడా ముందు అనుకున్న క‌థ వేరు. ఏదో చేద్దాం అని చేసుకుంటూ వ‌స్తే..హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చేయాల‌నుకున్న సినిమా కాస్త‌, హీరోయిక్ సినిమాగా మారిపోయింది. జోష్ క‌థ అనుకున్న‌ప్పుడు సినిమాపై నాగార్జున‌గారి అబ్బాయి సినిమా అనే ఇమేజ్ ఏర్ప‌డింది. అలాగే అప్ప‌టికే కాలేజీల్లో గొడ‌వ‌లు ఉండేవి కావు. దాని కార‌ణంగా జోష్ సినిమా స‌క్సెస్ కాలేక‌పోయింది.

ప్రేక్ష‌కుల‌తో పాటు మ‌నమూ మారాలి..
- ఆడియెన్స్ అనేవారు ఎప్పుడూ మారుతుంటారు. ఈవాళ ప్రేక్ష‌కుడికి ఎంట‌ర్‌టైన్మెంట్ అనేది వివిధ రూపాల్లో దొరుకుతుంది. వాటిని దాటుకుని సినిమా థియేట‌ర్ వ‌ర‌కు ప్రేక్ష‌కుడు రావాలంటే, మ‌నం కూడా మారాలి. లేకుంటే మ‌న‌మే వెనుక‌ప‌డిపోతాం.

సినిమాకు ఆ న‌లుగురే మెయిన్ పిల్ల‌ర్స్‌..
- మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉండే ఓ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీయే `ఎంసీఏ`. శ‌త‌మానం భ‌వ‌తిలో త‌ల్లిదండ్రులు గురించి చెప్పాం. `ఫిదా`లో నాన్న కూతురి గురించి చెప్పాం. ఇప్పుడు `ఎంసీఏ`లో వ‌దిన మ‌రిది బ్యాక్ డ్రాప్ ను తీసుకుని సినిమా చేశాం. నాని, భూమిక‌, సాయిప‌ల్ల‌వి, విల‌న్ విజ‌య్ వర్మ అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ ఏడాది ఈ సినిమాతో ఆరో స‌క్సెస్ కొడ‌తామ‌నే న‌మ్మ‌కం ఉంది. సినిమా ఫ‌స్టాఫ్ అంతా ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు, ల‌వ్ సీన్స్ అన్ని ఉంటాయి. ఇక సినిమా సెకండాఫ్‌లో మెయిన్ క‌థ‌లోకి వెళ‌తాం. ఇది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. సినిమాలో చివ‌రి 15 నిమిషాలు ఎంతో కీలకంగా ఉంటుంది. అన్ని ఈక్వెన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాను తెర‌కెక్కించాం.

- శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో ఈ ఏడాది గొప్ప‌గా ప్రారంభ‌మైంది. ఆ సినిమా చేసే స‌మ‌యంలో యూత్‌కు న‌చ్చితే మ్యాజిక్ క్రియేట్ అవుతుంద‌నుకున్నాం. అనుకున్న‌ట్లుగానే శ‌త‌మానం భ‌వ‌తి యూత్‌ను ఆక‌ట్టుకోవ‌డంతో క‌లెక్షన్స్ ప‌రంగా సినిమా పెద్ద సినిమాల పోటీని తట్టుకుని నిల‌బ‌డ‌ట‌మే కాక‌, జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో నేను లోక‌ల్ చేశాను. బ‌న్నితో చేసిన మూడో సినిమా డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్. ఈ సినిమా నిర్మాత‌గా నా 14 ఏళ్ల కెరీర్‌లో హ‌య్య‌స్ట్ ప్రాఫిట్ ఫిలింగా నిలిచింది.`ఫిదా`తో మ‌రోసారి మ్యాజిక్ చేశాం. బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. వ‌రుణ్‌తేజ్‌, శేఖ‌ర్ క‌మ్ములకు హిట్ తెచ్చి పెట్టిన సినిమా. ఐదో సినిమా రాజా ది గ్రేట్‌. ర‌వితేజ‌గారు రెండేళ్ల త‌ర్వాత చేసిన ఈ సినిమా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించింది.

సినిమాల గురించి ఎనాల‌సిస్ చేస్తుంటాను..
- ఇండ‌స్ట్రీలో మంచి పోజిష‌న్‌లో ఉండి ఓ మాట చెబితే, ఆ మాట‌కు విలువ ఉండాలి. నేను నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా సినిమాల గురించి పూర్తి ఎనాలసిస్ చేస్తుంటాను. నేను ఈ ఏడాది ఐదు సినిమాల్లో, అప్రిసియేష‌న్ ఉంది, అలాగే కాంట్ర‌వ‌ర్సీ కూడా ఉంది. నేను ఇప్ప‌టి వ‌ర‌కు కాంట్ర‌వ‌ర్సీల జోలికెళ్ల‌ను. ఇక డీజే విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ ఎక్కువ‌గా న‌ష్ట‌పోతే, రాజా ది గ్రేట్ విష‌యంలో కూడా అలాగే న‌ష్టపోయారని వార్త‌లు వచ్చాయి. నిజానికి నేను చెప్పేదేంటంటే..నిర్మాత‌గా నా సినిమాను మేజ‌ర్ ఏరియాస్‌లో నేనే రిలీజ్ చేస్తాను. నేను బేసిక్‌గా డిస్ట్రిబ్యూట‌ర్‌ను, సినిమా విడుద‌ల స‌మ‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్‌కు ఎంత పెయిన్ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. నాకు ముగ్గురు న‌లుగురు డిస్ట్రిబ్యూట‌ర్స్‌ను ప‌క్కాగా ఉంటారు. నేను కూడా డిస్ట్రిబ్యూట‌ర్ కావ‌డం వ‌ల్ల ఏ ఏరియాలో ఎంత వ‌స్తుందో నాకు తెలుసు. కానీ చాలా మంది హైర్ వేల్యూను షేర్‌లో క‌లిపేసి క‌లెక్ష‌న్స్ చెబుతుంటారు. ఆ విష‌యంలో మ‌న‌ల్ని మనం మోసం చేసుకోకూడ‌ద‌ని నేను చెబుతుంటాను. కానీ విన‌రు. ఒక‌ర్ని చూసి ఒక‌రు త‌ప్పు చేస్తున్నారు. బాలీవుడ్ త‌ర‌హాలో విడుద‌ల వారం వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే చెప్పాలి.

త‌ర్వాతే షేర్ క‌లెక్ష‌న్స్ చెప్పాలి. ఇలా చేస్తూ వ‌స్తే కాంట్ర‌వ‌ర్సీలు త‌గ్గుతూ వ‌స్తాయి. డిస్ట్రిబ్యూట‌ర్ బావుంటేనే నిర్మాత‌కు మార‌ల్ స‌పోర్ట్ ఉంటుంది. నిర్మాత‌గా నా డిస్ట్రిబ్యూట‌ర్స్‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త నాదే. ఉదాహ‌ర‌ణ‌కు ఓ సినిమాను విడుద‌ల చేసిన డిస్ట్రిబ్యూట‌ర్‌కు కోటి రూపాయలు న‌ష్టం వ‌స్తే..నిర్మాత‌గా నేను 30 నుండి 35 ల‌క్ష‌లు స‌హాయం చేశాన‌నుకోండి. డిస్ట్రిబ్యూట‌ర్‌కి నిర్మాత‌పై న‌మ్మ‌కం ఉంటుంది. అలా కాకుండా బిజినెస్ అయిపోయింది క‌దా, ఇంకేముందిలే అనుకుంటే, అక్క‌డితో ఆ నిర్మాత‌కు, డిస్ట్రిబ్యూట‌ర్‌కు రిలేష‌న్ పోతుంది. సాధార‌ణంగా సినిమా బిజినెస్ విష‌యంలో నిర్మాత‌కు, డిస్ట్రిబ్యూట‌ర్‌కు అగ్రిమెంట్స్ ఉన్నా, దాన్ని మించినా రిలేష‌న్ ఉండాలి. అప్పుడే డిస్ట్రిబ్యూట‌ర్ నిర్మాత‌తో క‌లిసి ట్రావెల్ చేస్తాడు. డిస్ట్రిబ్యూట‌ర్ బ్ర‌తుకుతాడు. అలాగే ఓ ప్రాజెక్ట్ కాస్ట్‌తో పోల్చిన‌ప్పుడు క‌లెక్ష‌న్స్ బావుంటేనే అది స‌క్సెస్‌ఫుల్ సినిమా లేదంటే అది ఫెయిల్యూర్ సినిమానే. ఓ సినిమా తీస్తున్న‌ప్పుడు బ‌డ్జెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ . ఆ సినిమా త‌ర్వాత ఎంత క‌లెక్ట్ చేస్తుందో అనేది కూడా ఇంపార్టెంట్‌. ఈ ఏడాది నిర్మాత‌గా నేను నేర్చుకున్న‌ది అదే.

పైర‌సీపై ఇద్ద‌రూ పోరాడాలి....
- సినిమా అనేది మారుతూ వ‌స్తుంది. ఒక‌ప్పుడు వంద‌రోజులు ఆడే సినిమాలు మూడు వారాలు ఆడితే చాల‌నుకునే స్థితికి చేరుకున్నాం. ఆడియెన్స్‌ఫాస్ట్‌గా ఉన్న‌ప్పుడు మ‌నం కూడా సినిమాను ఫాస్ట్‌గానే అందివ్వాలి. సినిమా విడుద‌లైన రెండో రోజుకే పైర‌సీ సీడీ వ‌చ్చేస్తుంది. ఎవ‌రైనా పైర‌సీని చూడ‌కుండా మానుకుంటున్నారా..చూస్తూనే ఉన్నారు. పైర‌సీ సినిమా దొరికేస్తున్న‌ప్పుడు అమెజాన్‌లో సినిమాను ప్రేక్ష‌కుడు కొనుక్కొని చూస్తే త‌ప్పేంటి? నిర్మాత‌గా డిజిట‌ల్ రైట్స్ అమ్మ‌డాన్ని ఆప‌మ‌ని చెప్ప‌డం లేదు. దాని కంటే ముందుగా పైర‌సీ రూపంలో పెద్ద డ్యామేజ్ జ‌రుగుతుంది. ముందు దాన్ని ఆపాలి. పైర‌సీపై డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత క‌లిసి పోరాడాలి.

కొత్త ద‌ర్శ‌కుల‌తో...
- నా బ్యాన‌ర్‌లో నెక్ట్స్ రెండు సినిమాలు చేయ‌బోతున్నాను. ఇద్ద‌రూ కొత్త ద‌ర్శ‌కులే. `అదే నువ్వు అదే నేను` అనే టైటిల్‌తో ఓ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా, శ‌శి అనే కొత్త ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా చేస్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved