pizza
Sundeep Kishan Birthday interview 2017
సందీప్‌కిష‌న్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌
You are at idlebrain.com > news today >
Follow Us

06 May 2017
Hyderabad

మే 7న హీరో సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు, ఈ సంద‌ర్భంగా సందీప్ కిష‌న్ పాత్రికేయ మిత్రుల‌ను క‌లిసి త‌న‌కు ప్రోత్సాహం అందిస్తున్నంద‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా..

హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``నేను సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయ్యి ఎనిమిది సంవ‌త్స‌రాలు అవుతుంది. నేను ఇంత కాలం రాణించానంటే అందుకు కార‌ణం ప్రేక్ష‌కులు, మీడియానే. ఈ జ‌ర్నీ జ‌యాప‌జ‌యాల‌ను చూశాను. జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే ప్రేక్ష‌కులు అంద‌రూ గుర్తుంచుకునే సినిమాలు చేశాను. ఇది నిజంగా నా అదృష్టం. ఇంత‌టి గుర్తింపున‌చ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు, మీడియా వ‌ర్గాల‌కు నా కృతజ్ఞ‌త‌లు. ఈ ఏడాది `న‌గ‌రం`(త‌మిళంలో మా న‌గ‌రం) సినిమా తెలుగు, త‌మిళంలో మంచి హిట్ అయ్యింది. కృష్ణ‌వంశీగారి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌నే క‌ల ఈ ఏడాది పూర్త‌య్యింది. కృష్ణ‌వంశీగారి ద‌ర్శ‌క‌త్వంలో న‌క్ష‌త్రం సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. రేపు టీజ‌ర్ కూడా విడుద‌ల‌వుతుంది. ఏడాదిగా చేస్తున్నారెందుకు అని అడుగుతున్నారు. కానీ రేపు అవుట్ పుట్ చూస్తే అర్థ‌మవుతుంది. సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `నా పేరు శివ` సీక్వెల్‌లాంటి సినిమా తెలుగు, త‌మిళంలో చేస్తున్నాను.

Sundeep Kishan Interview gallery

మంజుల‌గారి దర్శ‌క‌త్వంలో ఓ ల‌వ్ స్టోరీ చేయ‌బోతున్నాను. మంజుల‌గారి ప్రొడ‌క్ష‌న్ తో పాటు జెమిని కిర‌ణ్‌గారి ప్రొడ‌క్ష‌న్‌లో ఈ సినిమా ఉంటుంది. అలాగే మాయావ‌న్ సినిమాను తెలుగులో ప్రోజ‌క్ట్ జెడ్ పేరుతో విడుద‌ల చేస్తున్నాం. మ‌న క‌ష్టం ఎంతుంటే అంత మంచిది. త‌ప్ప‌కుండా స‌క్సెస్ వ‌స్తుంద‌ని నేర్చుకున్నాను. ఈ ఏడాది రానున్న సినిమాల‌న్నీ మంచి సినిమాలు అవుతాయి. న‌క్షత్రం సినిమాలో సందీప్‌కిష‌న్ కంటే రామారావు అనే పాత్ర మాత్ర‌మే క‌న‌ప‌డుతుంది. టీ కొట్టు పెట్టుకుని, పోలీసు కావాల‌ని క‌ల‌లు క‌నే అబ్బాయి పాత్రలో క‌న‌ప‌డ‌తాను. కృష్ణ‌వంశీగారి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. నేను, సాయిధ‌ర‌మ్ తేజ్ మంచి స్నేహితులం. న‌క్ష‌త్రం సినిమాలో ఇద్ద‌రం క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved