pizza
Allu Sirish birthday (30 May) interview
సినిమాల విష‌యంలో హ‌ద్దులు లేవు - అల్లు శిరీష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

29 May 2018
Hyderabad

`గౌర‌వం, కొత్త‌జంట‌, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, ఒక్క‌క్ష‌ణం` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన హీరో అల్లు శిరీష్‌. ఈ యువ క‌థానాయ‌కుడి పుట్టిన‌రోజు మే 30. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల‌తో ఏర్పాటు చేసిన ఇంట‌ర్వ్యూలో శిరీష్ త‌న సినిమాల గురించిన విశేషాల‌ను తెలియ‌జేశారు....

- ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో దుల్క‌ర్ స‌ల్మాన్ చేసిన `ఏబీసీడీ`(అమెరిక‌ర్ బ‌ర్న్డ్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశీ) సినిమా రీమేక్‌లో న‌టిస్తున్నాను. అలాగే సూర్య‌, కె.వి.ఆనంద్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. మోహ‌న్‌లాల్‌గారు కూడా మాతో న‌టిస్తున్నారు. 100 కోట్ల సినిమా.. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. నేను సూర్య‌గారికి వీరాభిమానిని. ఈసినిమాలో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. జూలై 1న లండ‌న్‌లో సినిమా స్టార్ట్ అవుతుంది. న‌వంబ‌ర్ వ‌ర‌కు జ‌ర‌గుతుంది. సూర్య‌గారి సినిమాకు సంబంధించి ఎక్కువ విష‌యాను చెప్ప‌లేను. కె.వి.ఆనంద్‌గారికి ఆయ‌న, నాకు కామ‌న్‌గా ఉండే స్నేహితులు ..న‌న్ను ఈ క్యారెక్ట‌ర్‌కు రెఫ‌ర్ చేశారు. అప్పుడు ఆయ‌న నేను న‌టించిన ఒక్క‌క్ష‌ణం సినిమా చూశారు. అందులో నా వ‌ర్క్ న‌చ్చ‌డంతో ఆయ‌న సూర్య సినిమా కోసం న‌న్ను సంప్ర‌దించారు. సినిమా ఓకే అయ్యింది.

- ఏబీసీడీ క‌థ గురించి రెండు మూడేళ్లుగా తెలుసు. ముందు రీమేక్ సినిమా ఎందుకు చేయాల‌ని ఆగిపోయాను. అయితే ఈ మ‌ధ్య‌లో నాకు ఎప్పుడు బోర్ కొట్టినా.. ఆ సినిమా క‌థ‌ను చూస్తుండేవాడిని. ముందు మ‌ధుర‌ శ్రీధ‌ర్‌గారు వేరే సినిమా రైట్స్ తీసుకొచ్చి..సంజీవ్ డైరెక్ట్ చేస్తార‌ని చెప్పారు. అయితే రీమేక్ చేయాల‌నే ఉద్దేశం ఉంటే నా ద‌గ్గ‌ర మంచి ఆప్ష‌న్ ఉంద‌ని `ఏబీసీడీ` చూడ‌మ‌ని అన్నాను. వాళ్ల‌కు న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. నెటివిటీ స‌హా అన్నీ కుద‌రాలి. రీమేక్ చేయ‌డానికి కార‌ణం క‌థ‌లు లేవ‌ని కావు.. మ‌న దృష్టి నుండి మంచి క‌థ ఎందుకు మిస్ అయిపోవాల‌నిపించింది. రీమేక్‌ల గురించి మ‌నం ఆలోచించినంత‌గా ప్రేక్ష‌కులు ఆలోచించ‌రు. వారికి సినిమా న‌చ్చితే చాలు.

- 1971 సినిమా అనుకోకుండా వ‌చ్చింది. అది కాకుండా త‌మిళ్‌లో చేస్తున్నాను. తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాను. మ‌నతో పోల్చితే వారి చిత్రీక‌ర‌ణ‌ల్లో తేడాలుంటాయి. ప‌ర్టికుల‌ర్‌గా ఇలాంటి సినిమాలే చేయాల‌ని అనుకుని హ‌ద్దులు పెట్టుకోలేదు.

- నా సినిమా క‌థ‌ల‌ను ముందుగా నాన్న వింటారు. సెట్స్‌కు వెళ్లే ముందు బ‌న్ని కూడా వింటాడు. ఇద్దరి ఆలోచ‌న‌లు తెలుసుకుంటాను. సినిమా పూర్తి చేసి ఎడిటింగ్ అయిన త‌ర్వాత కూడా నాన్న‌కు , బ‌న్నికి సినిమా చూపిస్తాను.

interview gallery



- ఏబీసీడీలో మిలియనీర్ కొడుకుగ్గా క‌న‌ప‌డ‌తాను. డ‌బ్బులు విలువ తెలియ‌దు. ఆ విలువ తెలియ‌జెప్ప‌డానికి ఇండియా టూర్‌కి పంపి హీరో ద‌గ్గ‌ర ఉండే అకౌంట్‌, కార్డ్స్ అన్నింటిని క్యాన్సిల్ చేస్తారు. నెల‌కు ఐదువేల రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తాం అంటారు. అప్పుడు హీరో ఏం చేస్తాడు? హీరో మారుతాడా? లేదా? అనేదే సినిమా.

- ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు. సంజీవ్ డెబ్యూ డైరెక్ట‌ర్ అయినా.. త‌ను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. త‌న‌పై నాకు న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

- ఒక్క‌క్ష‌ణం సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మేం ఆశించినంత రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. అందుకు చాలా మంది చాలా కార‌ణాలు చెప్పారు. కంటెంట్ ప‌రంగా మేం హ్యాపీ. అయితే ఇంకా బెట‌ర్ రిజ‌ల్ట్ వ‌స్తే బావుండున‌ని అనిపించింది. అలాగ‌ని డిస‌ప్పాయింట్ కాలేదు. ఈ సినిమా త‌ర్వాత చాలా మంది ఇన్‌టెన్సిటీ ఉన్న‌పాత్ర‌లు చేయ‌మ‌ని అడుగుతున్నారు. నా వ‌ర‌కు ఒక్క క్ష‌ణం నా కెరీర్‌లో బెస్ట్ ఫిలిం.

- ఇత‌ర హీరోలు త‌ర‌హాలో వేగంగా సినిమాలు చేయ‌డం లేదు. మా అన్న‌య్య వ‌చ్చి 15 ఏళ్లు అవుతున్నా..17 సినిమాలు మాత్ర‌మే చేశాడు. ఒక సినిమాపై ఫోక‌స్‌గా ఉంటే క్వాలిటీ ఉండొచ్చు అనేది క‌రెక్టే. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా ముందుకెళ్లాలంటే ఎక్కువ సినిమాలు చేయాలి. ఇక‌పై ఎక్కువ సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved