pizza
Naresh birthday (20 January) interview
న‌టుడిగా 2018 నా కెరీర్‌లో ది బెస్ట్ - న‌రేష్
You are at idlebrain.com > news today >
Follow Us


19 January 2019
Hyderabad

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న న‌రేష్ విజ‌య్ కృష్ణ పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 20. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పాత్రికేయుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ...

- ఒక న‌టుడి కెరీర్‌లో స‌క్సెస్.. ఫెయిల్యూర్స్ కామ‌న్‌. నాటి ఎన్టీఆర్ నుండి నేటి హీరోలు ఎవ‌రికైనా గెలుపు ఓట‌ములు ఎదుర‌వుతుంటాయి. ఐదారేళ్ల క్రితం మంచి హిట్ రాదా? అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే నాలుగైదేళ్లుగా దృశ్యం సినిమా నుండి వ‌రుస‌గా మంచి సినిమాలు వ‌స్తున్నాయి. మంచి సినిమాలు, పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చి సినిమాలు చేసుకుంటూ వ‌స్తున్నాను. స‌క్సెస్ రేట్ పెరుగుతూ వ‌స్తుంది. - క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చిన‌ప్పుడు ఎస్‌.వి.రంగ‌రావుగారికి దృష్టిలో పెట్టుకున్నాను. ఓ తెలుగు న‌టుడు ఏ పాత్ర చేయ‌గ‌ల కెపాసిటీ ఉంది. కాబ‌ట్టి ఓ జోన‌ర్‌కే ప‌రిమితం కాకుండా అన్నీ సినిమాలు చేయాల‌నుకున్నాను. నాకు వ‌చ్చిన పాత్ర‌ల‌న్నీ అలా డిఫ‌రెంట్‌గానే వ‌చ్చాయి. గ‌త ఏడాది తెలుగు సినిమాకు వ‌చ్చిన 10-12 హిట్ చిత్రాల్లో 8 చిత్రాల్లో నేను న‌టించాను. మంచి పాత్ర‌లు చేశాను. నాపై ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు పెట్టుకున్న న‌మ్మ‌కం. శ‌త‌మానం భ‌వ‌తి, రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, దేవ‌దాస్, తొలిప్రేమ‌ ఇలా మంచి మంచి సినిమాల్లో మంచి పాత్ర‌ల్లో న‌టించాను. స‌మ్మోహ‌నం నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అలాగే అర‌వింద స‌మేత వంటి సీరియ‌స్ చిత్రంలో కామెడీ పార్ట్ నా పాత్ర‌నే క్యారీ చేసింది. అలాగే శైలజారెడ్డి అల్లుడులో మంచి పాత్ర చేశాను. 2018 న‌టుడిగా నా కెరీర్‌లో బెస్ట్ ఇయ‌ర్. త్రివిక్ర‌మ్‌, సుకుమార్ వంటి ద‌ర్శ‌కుల‌తో పాటు వెంకీ అట్టూరి, వెంకీ కుడుముల‌, నాగాశ్విన్ .. వంటి యువ ద‌ర్శ‌కులు కూడా నాకు మంచి ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఇచ్చారు.

- 47 ఏళ్లు న‌టుడిగా అనుభ‌వం వ‌చ్చింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాటు, ఎటువంటి కాంట్ర‌వ‌ర్సీకి పోక‌పోవ‌డం అనేవి న‌టుడిగా నా స‌క్సెస్‌కు కార‌ణమ‌ని భావిస్తున్నాను. పారితోషకం, ఇత‌ర అంశాల కంటే మంచి సినిమా, మంచి పాత్ర పోషించ‌డం.. వ‌చ్చిన అవ‌కాశానికి పూర్తి న్యాయం చేయ‌డం, చిన్న బ‌డ్జెట్ సినిమాల‌కు అందుబాటులో ఉంటాన‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను.

- వెబ్ సిరీస్‌ల్లో కూడా నాకు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మంచి వెబ్ సిరీస్ ఎంచుకుని అందులో న‌టిస్తాన‌ని తెలియ‌జేస్తున్నాను. నెల‌కు 29రోజులు ప‌నిచేసిన రోజులున్నాయి.

- కొంచెం సెల‌క్టివ్‌గా మంచి పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నాను. ఈ ఏడాది కూడా మంచి పాత్ర‌ల‌తోనే స్టార్ట్ అయ్యింది. మ‌ల్లి జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ హీరోగా చేస్తున్న సినిమాలో న‌టిస్తున్నాను. అలాగే ఫ‌ణిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాను. వీటితో పాటు మ‌రో ఆరు సినిమాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి.

- ఒక‌ప్పుడు మ‌నం ఇత‌ర భాష‌ల రీమేక్‌ల కోసం వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు ఇత‌ర భాష‌ల వాళ్లు మ‌న రీమేక్‌ల కోసం వ‌స్తున్నారు. ఇది తెలుగు సినిమాకు పెద్ద వ‌రం. ఎందుకంటే కొత్త ఆలోచ‌న‌లున్న కొత్త త‌రం ద‌ర్శ‌కులు చాలా మంది ఇండ‌స్ట్రీలోకి వ‌స్తున్నారు. 2019 కూడా తెలుగు ఇండ‌స్ట్రీకి చాలా బావుంటుంది.

- న‌వీన్ విజ‌య్ కృష్ణ‌కు `ఊరంతా అనుకుంటున్నారు` సినిమా రెడీ అవుతుంది.

- మ‌హాన‌టి .. క‌థానాయ‌కుడు రెండు బ‌యోపిక్స్‌లో మంచి పాత్ర‌లు చేశాను. క‌థానాయ‌కుడు వంటి బ‌యోపిక్ మ‌ళ్లీ రాదు. బాల‌కృష్ణ‌లో రామారావుగారు పూనారేమో. అంత గొప్ప‌గా న‌టించారు. ,నా చిన్న‌నాటి మిత్రుడు బాల‌కృష్ణ కెరీర్‌లో బెస్ట్ ఫిలిం అని నేను భావిస్తున్నాను. క్రిష్ ద‌ర్శ‌కుడిగా నెక్ట్స్ స్థాయికి చేరుకున్నాడు. ఈ ఏడాది క‌థానాయ‌కుడుతో మంచి ప్రారంభం ల‌భించింది.

- మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) 25 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటుంది. ఒక మెంబ‌ర్‌గా నా వంతు స‌పోర్ట్ చేస్తున్నాను. నా కుటుంబం నుండి ప్ర‌తి నెల 15 వేల రూపాయ‌ల‌ను పెన్ష‌న్‌గా అమ్మ విజ‌య‌నిర్మ‌ల‌గారు అందిస్తున్నారు. ఆమె వ‌య‌సు ఎంతో అంతే మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారావిడ‌. అలాగే ఒక‌సారి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఇచ్చారు. రీసెంట్‌గా క‌ల్యాణ ల‌క్ష్మి ప‌థకం కోసం ఒక‌టిన్న‌ర ల‌క్ష రూపాయ‌లు ఇచ్చారు. దాస‌రి నారాయ‌ణ‌రావుగారి ఆదేశాల మేర‌కు జ‌య‌సుధ‌గారితో క‌లిసి జాయింట్ సెక్ర‌ట‌రీగా పోటీ చేశాను. అప్పుడు రెండు చీలిన `మా` ఆర్గ‌నైజేష‌న్‌ను క‌లిపాం. వెల్ఫేర్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఉంటూ మంచి కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాం. అర్హ‌త ఉన్న‌వారికి దిశ‌, ద‌శ క‌ల్పించాం. పెన్ష‌న్ మొత్తాన్ని పెంచాం. వాహ‌నాలు ఇచ్చాం. సిల్వ‌ర్ జూబ్లీ ట‌ర్మ్ పూర్త‌య్యింది. కొన్ని కాంట్ర‌వర్సీలు జ‌రిగాయి. అదిప్పుడు అన‌వ‌స‌రం. రానున్న ట‌ర్మ్స్ కీలకంగా మార‌నున్నాయి. `మా` భ‌వ‌నం కూడా ఈ ట‌ర్మ్‌లోనే నిర్వ‌హించ‌బోతున్నాం. `మా` ఎలక్ష‌న్ అనివార్య‌మైన‌ప్పుడు.. అంద‌రినీ సంప్ర‌దించి అవ‌స‌రం అయితే నేను కూడా పోటీ చేస్తాను. మా ప్ర‌తిష్ట‌ను పెంచ‌డానికి, ధ‌ర్మం కాపాడ‌టానికి అంద‌రూ కోరితే నేను పోటీ చేస్తాను. సామ‌ర‌స్యంగా వెళ్లేలా కూడా చూస్తాం. ప‌ద‌వులు కోసం నేను ఎప్పుడూ పాకులాడ‌లేదు. పాకులాడ‌ను కూడా. దీన్ని ఆస‌రాగా తీసుకుని నా వ్యాపార‌మో, నాస్థాయినో పెంచుకోవ‌డానికి నేను ప‌నిచేయ‌ను. నేను, రాజేంద్ర‌ప్ర‌సాద్ ఉన్న‌ప్పుడు అంద‌రూ క‌లిసి ఒక ట‌ర్మ్‌లో ఒక‌రు ఒకేసారి ప‌నిచేయాల‌నుకున్నాం. ఈ కుర్చీకి ఎవ‌రూ అతుక్కుపోకూడ‌ద‌ని అనుకుంటాను. నేను ఒక ట‌ర్మ్ మాత్ర‌మే నిల‌బ‌డ‌తాను. ఒక‌సారి గెలిస్తే చ‌రిత్ర‌లో మ‌ళ్లీ నిల‌బ‌డ‌ను.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved