30 May 2016
Hyderabad
జాలె ఫిలింస్ పతాకంపై జె.వి. నాయుడు ప్రధాన పాత్రలో నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రైమ్ రిలెటెడ్ రొమాంటిక్ థ్రిల్లర్ 'బిట్రగుంట'. ది బిగినింగ్ అనేది ఉపశీర్షిక. ఎల్లసిరిమురళీధర్ రెడ్డి, ఇషిక హీరోహీరోయిన్‌లుగా తొలి పరిచయంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జూన్ 15 నుండి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపనున్నారు. గతంలో ప్రేమలో ఎబిసి, లంగావోణి చిత్రాల దర్శకుడు నాగరాజు తలారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ...'దారి దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ గ్యాంగ్‌లకు, పోలీసులకు మధ్య జరిగే ఛేజింగ్‌లతో ఈ చిత్రాన్ని అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో తెరకెక్కించడం జరుగుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అత్యంత ప్రధాన్యత సంతరించుకున్న ఈ చిత్రం జూన్ 15 నుండి షూటింగ్ జరుపుకోనుంది..' అని అన్నారు.
చిత్ర నిర్మాత జె.వి. నాయుడు మాట్లాడుతూ..'మా డైరెక్టర్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథను ఖర్చుకు వెనకాడకుండా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా రియాలిటీగా తెరకెక్కేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ తో కూడా సంప్రదింపులు జరపనున్నాం. నెల్లూరు జిల్లాలో ఎక్కువభాగం షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
జె.వి. నాయుడు ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కరుణాకర్, నిర్మాత: జాలె వాసుదేవనాయుడు, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: నాగరాజు తలారి.