pizza
Aadi's Black First Look
ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ విడుదల..
You are at idlebrain.com > news today >
 
Follow Us

23 December -2020
Hyderabad

 

ఆది సాయి కుమార్ హీరోగా మహాంకాళి మూవీస్ బ్యానర్‌పై మహాంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం బ్లాక్. కొత్త దర్శకుడు జిబి కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 23న ఆది పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు ఆది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా దర్శన బానిక్ నటిస్తున్నారు. లాక్‌డౌన్ కంటే ముందుగానే ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తి చేసారు మేకర్స్. ఈ సినిమాలో కౌశల్ మందా, ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తుండగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వివరాలు చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

నటీనటులు:
ఆది సాయికుమార్, దర్శన బానిక్, కౌశల్ మందా, ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్..

టెక్నికల్ టీం:
దర్శకుడు: జిబి కృష్ణ
నిర్మాత: మహాంకాళి దివాకర్
బ్యానర్: మహాంకాళి మూవీస్
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఎడిటర్: అమర్ రెడ్డి
సినిమాటోగ్రఫర్: సతీష్ ముత్యాల
పిఆర్ఓ: ఏలూరు శ్రీను

 

 

 

 





   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved