pizza
BMR team thanks Prabhas
మహేష్ , ప్రభాస్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్న " భలే మంచి రోజు టీం"
You are at idlebrain.com > news today >
Follow Us

23 December 2015
Hyderabad

ఈ క్రిస్మస్ కి రాబోతున్న సుధీర్ బాబు సినిమా " భలే మంచి రోజు ". టీజర్ మొదలయిన రోజు నుండి ఆడియో విడుదల దాక అందరి మనసు దోచుకున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. . అన్ని వర్గాల నుండి ఈ సినిమా కి భారీ అంచనాలు ఉండటం తో పాటు, ట్రైలర్ మరియు పాటలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా " భలే మంచి రోజు " సినిమా టీం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

" భలే మంచి రోజు " ఆడియో విడుదలకు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు , ట్రైలర్ ని మేచ్చుకోవడమే కాకుండా యంగ్ టీం మంచి ఎనర్జీ తో పని చేసారని కితాబు ఇచ్చారు. మహేష్ బాబు ఆడియో లో ఇచ్చిన స్పీచ్ , మరియు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ఇచ్చిన సపోర్ట్ సినిమా కి బాగా కలిసి వచ్చింది. మహేష్ బాబు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ట్రైలర్ ని షేర్ చేసి గట్టి సపోర్ట్ ఇచ్చారు. మహేష్ బాబు అభిమానుల ఆదరణ కూడా భలే మంచి రోజు సినిమా మీద అంచనాలు పెరిగేలా చేయడమే కాకుండా ఈ మధ్య విడుదల అయిన ట్రైలర్ లో మేటి గా నిలవడానికి దోహద పడ్డారు.

బాహుబలి స్టార్ ప్రభాస్ కూడా ముందు నుంచి భలే మంచి రోజు సినిమా కి సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమా విషయం లో ప్రభాస్ ప్రతి విషయం లో వెన్ను తట్టి ప్రోత్సహించారు. ట్రైలర్ ని అభినందించడమే కాకుండా పాటలన్నీ విని , చాలా అద్భుతంగా ఉన్నాయని టీం ని అభినందించారు. ఈ మధ్యనే ఈ చిత్రం టీం ని కలిసి స్వయంగా సినిమా గురించి అడిగి తెలుసుకొని అభినందించారు. ప్రభాస్ ప్రోత్సాహం టీం అందరికి ఒక కొత్త్త ఎనర్జీ ని ఇచ్చిందని చెప్పాలి. సూపర్ స్టార్ , రెబెల్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ,సినిమాకి మంచి ప్రచారం వచ్చేలా కృషి చేస్తున్నారు.

మా సినిమా ని ముందు నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు , రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు , మా టీం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. మీ ఆదరణ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ , మా " భలే మంచి రోజు " సినిమాను 25 న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం.

 Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved