pizza
Sridevi Katha book launch
ఈ నెల 20న అతిలోక సుంద‌రి `శ్రీదేవి క‌థ` పుస్త‌కావిష్క‌ర‌ణ‌!!
You are at idlebrain.com > news today >
Follow Us

18 March 2019
Hyderabad


ఈ నెల 20న అతిలోక సుంద‌రి `శ్రీదేవి క‌థ` పుస్త‌కావిష్క‌ర‌ణ‌!!

ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు తాజాగా రాసిన అతిలోక సుంద‌రి `శ్రీదేవి క‌థ‌` పుస్త‌కాన్ని యువ‌క‌ళావాహిని వారి ఆధ్వ‌ర్యంలో ఈ నెల 20వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఆవిష్క‌రించ‌బ‌డును. ఈ కార్య‌క్ర‌మానికి సుప్ర‌సిద్ధ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అంద‌రూ ఆహ్యానితులే. ఈ సంద‌ర్భంగా ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ...``ఈ పుస్త‌కంలో ఇంత వ‌ర‌కు చూడ‌ని ఫొటోల‌తో పాటు ఆమె గురించి చ‌ద‌వ‌ని అనేక అంశాలు పొందుప‌ర‌చ‌బ‌డ్డాయి. `సుమారు మూడు వంద‌ల పేజీలు క‌లిగిన ` శ్రీదేవి క‌థ‌` పుస్త‌కం అన్ని వ‌ర్గాల పాఠ‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా అలంక‌రించ‌బ‌డింది`` అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved