pizza
ఇఛా ఫౌండేషన్ కి బ్రహ్మాజీ ఆర్ధిక సాయం
You are at idlebrain.com > news today >
Follow Us

14 November 2014
Hyderabad

నెల రోజుల క్రితం హుద్‌హుద్ పేరిట ఓ తుఫాన్ ఉత్త‌రాంధ్ర‌ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆర్థిక స‌హాయ‌మందించి.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కి జీవితంపై మ‌ర‌ల ఆశ‌ను పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో భాగంగానే సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ కూడా త‌న వంతు ఆర్థిక‌ స‌హాయం అందించేందుకు ముందుకొచ్చారు. దీన్ని ఇఛా (హిందీలో 'కోరిక' అని అర్థం) ఫౌండేషన్ ద్వారా ప్ర‌జ‌ల‌కు అందించేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. ఇఛా ఫౌండేష‌న్ గురించిన వివ‌రాల్లోకి వెళితే.. మ‌ధు ట‌గ్‌నైట్ దీన్ని స్థాపించారు. స‌రైన ఆస‌రాలేని ఒంట‌రి స్త్రీల‌కు ఆధారంగా నిలిచి.. స‌మాజంలో వారు నివ‌సించేందుకు ఓ స్థిర నిర్మాణం క‌ల్పించ‌డాన్నే లక్ష్యంగా చేసుకుని ఆమె (మ‌ధు) ఈ ఫౌండేష‌న్ స్థాపించారు. ఆర్థికంగా ఆస‌రాలేక ఇబ్బంది ప‌డుతున్న ఒంట‌రి స్త్రీల‌కు.. అలాగే పెద్ద‌ వ‌య‌సులో ఉన్న ఆడ‌వారికి భ‌రోసానిచ్చి వారి కోసం ఓ కొత్త బంగారు లోకం అందించేందుకు ఇఛా ఫౌండేష‌న్ న‌డుం బిగించింది. అంతేకాకుండా.. 0-6 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండే అనాధ పిల్ల‌ల‌ను చేర‌దీసి.. వారు మ‌రొక‌రిపై ఆధార‌ప‌డ‌ని స్థాయికి వ‌చ్చేవ‌రకు ఓ మార్గం చూపించాల‌న్న‌ది కూడా ఇఛా ఫౌండేష‌న్ సంక‌ల్పం. ఈ చిన్నారుల ఎదుగుద‌ల‌ బాధ్య‌త‌ను ఓ వ‌య‌సు వ‌ర‌కు ఈ ఒంట‌రి స్త్రీలే చూసుకుంటారు. అంటే.. ఓ సంస్థ ఆశ‌యం.. ఏక‌కాలంలో రెండు వ‌ర్గాల వారికి జీవ‌నాన్ని ఇవ్వ‌డం అనే దిశ‌గా ఉంద‌నుకోవ‌చ్చు. ఈ క‌మ్యూనిటీ.. జీవిత‌కాలం పాటు ఉండే నివాసితుల‌కు ఆతిథ్య‌మివ్వ‌డ‌మే కాకుండా..వివిధ స‌మ‌యాల్లో వ‌చ్చిపోయే అతిథుల‌కు కూడా కొంత ధ‌నాన్ని చెల్లిస్తే ఆతిథ్య‌మిచ్చే అవ‌కాశాన్నిస్తోంది. చీడ‌పీడ‌ల జీవితాన్ని న‌యం చేసేందుకు.. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన జీవన విధానాన్ని కొన‌సాగించేందుకు.. నిష్క‌ల్మ‌ష‌మైన వాతావ‌ర‌ణంలో నివాసితుల‌ను ఉంచేలా ఇఛా ఫౌండేష‌న్ కొన్ని వ‌న‌రుల‌ను క‌ల్పిస్తోంది. ఇఛా ఫౌండేష‌న్ ప్ర‌ధాన లక్ష్యం గురించి చెప్పాల్సివ‌స్తే.. ప్ర‌కృతికి చేరువ‌లో ఉండేలా జీవ‌న‌శైలికి తీసుకెళ్ల‌డం.. అలాగే ఆశ్రితుల ప్ర‌తిభ‌ని ప్రోత్స‌హిస్తూ ఈ క‌మ్యూనిటీని మ‌రింత‌మందికి మ‌రింత చేరువ‌య్యేలా చేయ‌డం. ఇందుకోసం.. ప్ర‌త్యేక శిక్షితుల‌ను తీసుకువ‌చ్చి.. ప‌లు శాఖ‌ల్లో శిక్ష‌ణ‌నిచ్చి మ‌రీ నివాసిత స‌భ్యుల్లో చైత‌న్యం క‌లిగించే వైపుగా ఈ క‌మ్యూనిటీ అడుగులు వేస్తోంది. అంటే.. ఏ ప్రాంతానికి చెందిన‌ సంప్ర‌దాయ క‌ళ‌ల‌ను ఆ ప్రాంతాల‌కు చెందిన ఆశ్రిత సభ్యులు మ‌రింత‌గా సంర‌క్షించే అవ‌కాశాన్నీ ఇఛా ఫౌండేష‌న్ క‌ల్పిస్తోంద‌న్న‌మాట‌.

ఇఛా ఫౌండేష‌న్ ఓ ప్ర‌భుత్వేత‌ర సంస్థ‌. ఇది లాభాల కోసం ఉద్దేశించింది కాదు. ఇండియ‌న్ ట్ర‌స్ట్ డీడ్ యాక్ట్ క్రింద రిజిస్ట‌ర్ చేయ‌బ‌డిన ఫౌండేష‌న్‌నే ఇఛా. ఇఛాకి అందించే విరాళాలు ఆదాయ ప‌న్నుచ‌ట్టం మిన‌హాయింపులో ఉండేవే. ఓ స‌ద్దుదేశంతో.. జీవితం మీద ఆశ కోల్పోయిన వారికీ.. అనాథ‌లైన పిల్ల‌ల‌కు.. జీవితం అందిస్తూ ముందుకెళుతున్న ఇఛా ఫౌండేష‌న్.. మున్ముందు ఎంతోమందికి జీవితాన్నిచ్చే దిశ‌గా త‌న అడుగులను ముందుకు వేస్తోంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved