pizza
C/o Surya 1st song launch tomorrow
సందీప్‌కిష‌న్ న‌టించిన "కేరాఫ్ సూర్య" మెద‌టి సాంగ్ ని విడుద‌ల చేస్తున్న క్రేజి హీరోయిన్ ర‌కూల్ ప్రీత్ సింగ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 October 2017
Hyderabad

సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైల‌ర్ తో ఈ సినిమాకు ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన చిత్ర ఫ‌స్ట్ సింగిల్ ని విడుద‌ల చేస్తున్నారు. అమ్మాయిల గొప్ప‌త‌నాన్ని చ‌క్క‌గా రామ‌జోగ‌య్య శాస్ట్రి గారు అందించిన లిరిక్స్ అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి. అంతేకాదు చాలా డీప్ మీనింగ్‌తో ఆయ‌న ఆడ‌వాళ్ళ ఔన్య‌త్యాన్ని రాశారు. ఇలాంటి అద్బుత‌మైన‌ పాట‌ని టాలీవుడ్ క్రేజి హీరోయిన్ ర‌కూల్ ప్రీత్ సింగ్ గారు అక్టోబ‌ర్ 6న 11 గంట‌ల‌కి విడుద ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య చిత్ర టీజర్ ను రిలీజ్ చేశాము. డిజిట‌ల్ వ్యూస్ దాదాపు 3ం లక్ష‌ల‌కు పైగా రావ‌టం హ్యాపిగా వుంది. అంతేకాకుండా ట్రేడ్ లో బిజినెస్ కూడా స్పీడ్ అందుకోవ‌టం విశేషం. ఇప్పుడు ఆడాళ్ళ‌తో డ్రామా అరే చెయ్య‌ద్దురా మామా అనే ఫ‌స్ట్ సాంగ్ ని ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కూల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా విడుదల చేస్తున్నాము. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సందీప్ కిషన్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. తనదైన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. మెహ్రీన్ కు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిట్ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నాం. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. త్వరలోనే భారీ ఈవెంట్ తో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం. ఈ సాంగ్ ముఖ్యంగా ఆడ‌వాళ్ళ హ్రుద‌యాల‌ను దోచుకుంటుంద‌ని ఆశిస్తున్నాము. అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.... కేరాఫ్ సూర్య షూటింగ్ దశలోనే నాకు పూర్తి సంతృప్తి ఇచ్చిన చిత్రం. అలాంటి చిత్ర టీజర్ ను నా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన నాని రిలీజ్ చేయడం, ఇప్పుడు మ‌రో బెస్ట్ ఫ్రెండ్ ర‌కూల్ ప్రీత్ సింగ్ ఈచిత్రం సింగిల్ విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా ఆడాళ్ళ‌తో డ్రామా అరె చెయ్య‌ద్దురా మామా అంటూ రాసిన ఈ సాంగ్ అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి, ఫిలిం ఇండస్ట్రీ నుంచి మంచి అప్లాజ్ వస్తుంద‌ని ఆశిస్తున్నాను. సుశీంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు శివ చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా కొత్త అనుభూతినిచ్చింది. ప్రతీ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే పాత్రలో కనిపించబోతున్నాను. ప్రతీ సీన్, ప్రతీ ఎమోషన్ ప్రతీ ఒక్కరినీ టచ్ చేస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మెహ్రీన్ సూపర్ యాక్ట్రెస్. ఆమెకు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఇమ్మాన్ మ్యూజిక్ మరో లెవల్ కు తీసుకెళ్తుంది. త్వరలోనే కేరాఫ్ సూర్య చేయబోయే భారీ ఈవెంట్ లో మరిన్ని విశేషాలు తెలియజేస్తాను. అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved