pizza
Carulo Shikarukelthe release on March 31
ఉగాది కానుకగా " కారులో షికారుకెళితే "
You are at idlebrain.com > news today >
Follow Us

19 March 2017
Hyderabad

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 31న " కారులో షికారు కెళితే " చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు . ధీరూ మహేష్ ,సుదర్శన్ ,ప్రియాంక , ఇషికా సింగ్ , జీవా తదితరులు నటించిన హర్రర్ థ్రిల్లర్ ని శ్రీ హరిహర ఫిల్మ్స్ పతాకంపై మధు , అనీష్ , అభిరాం లు సంయుక్తంగా నిర్మించారు . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ '' మీనాక్షి భుజంగ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది , పాటలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా అందరినీ అలరిస్తాయని ఇక చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా మా సినిమాకు మరింత అందాన్ని ఇచ్చిందని ...... మా కారులో షికారుకెళితే తప్పకుండా యూత్ అందరినీ ఆకట్టుకుంటుందని , హర్రర్ తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించామని '' సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేసాడు . ఇంతకుముందు గులాబీ వంటి సామజిక ఇతివృత్తం గల చిత్రాన్ని చేసి ప్రశంసలు అందుకున్న మాదాల కోటేశ్వర్ రావు కమర్షియల్ సక్సెస్ కోసం హర్రర్ బాట పట్టాడు .

చిత్ర నిర్మాతలు మధు , అనీష్ , అభిరాం లు మాట్లాడుతూ " మిత్రుడు కోటేశ్వర్ రావు చెప్పిన కథ నచ్చడంతో కేవలం అతడి పై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం . హర్రర్ నేపథ్యంలో రూపొందిన మా కారులో షికారుకెళితే చిత్రం తప్పకుండా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , అందుకే ఎన్ని చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ మా సినిమాని ఈనెల 31న రిలీజ్ చేస్తున్నామని అన్నారు . ​

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved