pizza
Chandamama Kathalu - Krishneswara Rao - A Beggar’s Mirage
You are at idlebrain.com > news today >
Follow Us

14 February 2014
Hyderabad

Let me introduce the crown jewel of all the stories, The Beggar. He is born at the signal light. He grew up watching the landscape of the signal change as he is begging. He doesn’t know who his father or his mother is. He is 60 and has lived all his life at the same signal. He has seen the worst days and lived through ghastly seasons, trashy conditions and public humiliations. After almost going through every bad thing that a human being could possibly experience, it is very natural but to become numb. He becomes oblivious to everything happening around him and tunes himself to one single goal, His own place for at least one peaceful nights’ sleep.

For once in his life, he wants to experience a quite night’s sleep without noises of speeding vehicle, smell of filth or policemen bothering him. He keeps staring at the sign board “For Sale” hanging on a tiny house everyday in a hope to own it one day.

Will the beggar live his dream? What is the role of his story in the overall aspect of the film?

This story dwells in to the inner aspects of human aspirations and dreams. A little known actor/writer, Krishneswara Rao played the role of the beggar.

After introducing the final character of Chandamama Kathalu in the next couple of days, we will move on to our next segment called “Straight from the Horses’ Mouth”. Stay tuned in!

Also starring in the film are Lakshmi Manchu, Krishnudu, Naresh, Aamani, Chaitanya Krishna, Abhijeeth, Kishore, Naga Shourya, Richa Panai, Isha Ranganath, Shamili Soundarajan, Rishi, Prithvi Raj, Kondavalasa, Surekha Vani, Surya, Snigdha, Inturi Vasu, Naveen Neni and 50 other actors.

యాచకుడు-ఎండమావులు

అతను ఒక యాచకుడు,ఒక సిగ్నల్ లైట్ దగ్గర పుట్టాడు,ఆ సిగ్నల్ లైట్,దాని చుట్టూ ఉన్న రోడ్,దాని పై కాలం తో పాటు రూపు మారే వాహనాలు...అన్నీ చూస్తూ,అక్కడే యాచిస్తూ పెరిగాడు.కని పడేసిన అమ్మ,నాన్న ఎలా ఉంటారో తెలీదు...60 ఏళ్లుగా ఎండ,వాన,చలి రూపం లో ప్రకృతి అసలు స్వరూపం చూసాడు,ఆకలి,అవమానాలు,చీదరింపులు,ఛీత్కారాలు అంటూ ఒక సాధారణ మనిషి పడే కష్టాలకంటే పదింతలు ఎక్కువ పడ్డాడు.సాధారణంగా ఒక మనిషి ఇంత రాటు దేలిన తరువాత మనసు మోద్దుబారుతుంది,అతను కూడా తన చుట్టూ జరుగుతున్న దేనికి చలించక ఇంకా తన బతుకు ని భారంగా నెడుతున్నాడంటే అది తనకున్న ఒకేఒక లక్ష్యం కోసం,ఒక ఇల్లు కొనడం.

ట్రాఫిక్ శబ్దాలు,మురికి వాసనలు,పోలీసు వాడి బెదిరింపులు వీటన్నిటినుంచి దూరంగా వెళ్లి కనీసం ఒక్క రాత్రి అయినా సుఖంగా నిద్రపోవడానికి ఒక చిన్న చోటు,తనది అని చెప్పుకోడానికి ఒక చిన్న ఇల్లు.అందుకోసం “ఫర్ సేల్” బోర్డు పెట్టిన ఒక ఇంటి ముందు రోజు పడిగాపులు,ఆ ఇంటిని ఏదోఒక రోజు సొంతం చేసుకోవాలనే ఆశ...

అసలు ఏమైంది? యాచకుడి కల నెరవేరిందా?”చందమామ కథలు” లోకల్లా ఆణిముత్యం లాంటి ఈ కథ మిగిలిన కథలకి ఎలాంటి ముగింపునిచ్చింది?

మనిషి ఆశల ఆంతర్యానికి అద్దం పట్టే ఈ కథలో ని యాచకుడి పాత్ర ను పోషించినిది మనలో కొద్దిమందికి సుపరిచితమైన నటుడు/రచయిత కృష్ణేశ్వర్ రావు గారు.ఆయన ఈ చిత్రం కోసం చేసిన సాహసం అనిర్వచనీయం.

“చందమామ కథలు” లోని చివరి పాత్ర ని ఇంకో రెండు రోజుల్లో మీకు పరిచయం చేసిన తర్వాత అక్కడినుంచి “స్ట్రైట్ ఫ్రం ది హార్సెస్ మౌత్”  అనే కొత్త దశ లోకి వెళ్తున్నాం,వేచి ఉండండి...

ఇంకా ఇందులో లక్ష్మి మంచు,కృష్ణుడు,నరేష్,ఆమని,చైతన్య కృష్ణ,అభిజీత్,కిశోర్,నాగ శౌర్య,రిచా పనయ్,ఇషా రంగనాథ్,షామిలి సౌందరాజన్,రిషి,పృథ్వీ రాజ్,కొండవలస,సురేఖా వాని,సూర్య,స్నిగ్ధ,ఇంటూరి వాసు,నవీన్ నేని, తో పాటు 50 మంది భారీ తారాగణం నటించడం జరిగింది.

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved