pizza
Chandrika Songs Coming soon
You are at idlebrain.com > news today >
Follow Us

10 May 2015
Hyderabad

Karthik Jayaram - Kamna Jetmalani – ​​Sreemukhi starrer bilingual (Telugu-Kannada) songs releasing Soon through Blockbuster Music. Lady Producer Mrs. V.Asha producing this Chandramukhi kind of movie under ‘Flying Wheels Productions’. Yogesh Munisiddappa is debuting as a Director with this Horror Entertainer. The shooting part including songs completed for this movie and the post production is going on at a brisk pace. The story revolves around a building where a newly married couple starts their conjugal life.


‘The mysterious incidents that took place in that palace and their consequences are very interestingly picturized‘ says the director Yogesh Munisiddappa. He also says that the performance of kamna, Sreemukhi and Story - Screenplay provided by Sajid Qureshi are the highlights of this movie.


Famous Kannada director turned actor Gireesh Karnad playing a very important role in this horror drama thriller. Producer Asha says that the movie is shaping very well, and the graphics of this movie will thrill the audience.

The songs of this movie tuned by Gunvanth Sen releasing soon through Blockbuster Music.

‘చంద్రిక’ పాటలు వచ్చేస్తున్నాయి!!

చంద్రముఖి, కాంచన’ తాజాగా ‘గంగ’ చిత్రాల కోవలో రూపొందుతున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ ‘చంద్రిక’. తెలుగు`కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌’ పతాకంపై శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్నారు. కార్తీక్‌ జయరామ్‌, కామ్నజెత్మలాని, శ్రీముఖి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ‘యోగేష్‌ మునిసిద్దప్ప’ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఓ కొత్త జంట ఎంతో అన్యోన్యంగా నివసించే ఓ భవనంలో పలు రకాల వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి అలా ఎందుకు జరుగుతున్నాయి? వాటి తాలూకు పరిణాలేమిటి? అన్నదే చిత్ర కథాంశం. హైద్రాబాద్‌, మరియు బెంగుళూరులో జరిగిన షెడ్యూల్స్‌తో షూటింగ్‌ పూర్తి చేసుకొన్న ‘చంద్రిక’ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటూ.. పాటల విడుదలకు సిద్ధమవుతోంది. ‘బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌’ ద్వారా ఈ గీతాలు త్వరలో విడుదల కానున్నాయి.


ఈ సందర్భంగా ‘ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌’ అధినేత్రి వి.ఆశ మాట్లాడుతూ.. ‘‘భారతీయ సినిమా చర్రితలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన ‘చంద్రముఖి’ని తలపించేలా.. ‘చంద్రిక’ చిత్రాన్ని మా దర్శకుడు యోగేష్‌ మునిసిద్దప్ప ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. హీరో కార్తీక్‌ జయరామ్‌, హీరోయిన్లు కామ్మజెత్మలాని, శ్రీముఖి ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. అలాగే గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ తదితరుల పాత్రలతోపాటు, గున్వంత్‌సేన్‌ మ్యూజిక్‌`రీ`రికార్డింగ్‌, సాజిద్‌ ఖురేషి సమకూర్చిన స్టోరి`స్క్రీన్‌ప్లే ‘చంద్రిక’ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. గ్రాఫిక్స్‌ వర్క్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ‘బ్లాక్‌బస్టర్‌ మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.


గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, తాగుబోతు రమేష్‌, సత్యం రాజేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: నాగు, ఎడిటింగ్‌: వి.సురేష్‌కుమార్‌, కెమెరా: కె. రాజేంద్రబాబు, యాక్షన్‌: ధ్రిల్లర్‌ మంజు, మ్యూజిక్‌: గున్వంత్‌సేన్‌, నిర్మాత: శ్రీమతి వి.ఆశ, కథ`స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, దర్శకత్వం: యోగేష్‌ మునిసిద్దప్ప

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved