pizza
Charan Deep about Birthday
సౌత్ ఇండియా స్టైలిష్ విలన్ చరణ్ దీప్( june 20th)బర్త్ డే
You are at idlebrain.com > news today >
Follow Us

20 June 2016
Hyderaba
d

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రామిసింగ్ విలన్ గా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ దీప్ పుట్టిన రోజునేడు. ప్రభాస్ నటించిన 'డార్లింగ్' సినిమాలో ఓ చిన్న పాత్రతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈ కడప కుర్రాడు.. ఆ తర్వాత తమిళంలో ఘన విజయం సాధించిన 'జిల్లా' చిత్రంతో ప్రతినాయకుడిగా దమ్ము చూపాడు. గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 'పటాస్'తో తనదైన విలనిజం పలికించి తెలుగు సినీజనాలను కూడా భయపెట్టాడు చరణ్. ఇక ఆల్ టైమ్ హిట్ 'బాహుబలి'లో కాలకేయ తమ్ముడి పాత్రలోనూ క్లైమాక్స్ ఫైట్ లో క్రూరత్వం చూపించాడు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్- వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన 'లోఫర్'లో ప్రతినాయకుడిగా చరణ్ దీప్ అదరహో అనిపించాడు. ఇక కన్నడనాట భారీ విజయం సాధించిన 'బాక్సర్'లో రేసర్ గా హీరోకు టప్ కాంపిటేషన్ ఇచ్చి కెరీర్ ను టాప్ గేర్ కు తీసుకెళ్లాడు ఈ కడప బాంబ్. ఆ ఊపులోనే ఇండియన్ ఫస్ట్ మోటోక్రాస్ మూవీ 'నాను మతు వరలక్ష్మి' మూవీలోనూ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. పాత్రలకు తగ్గట్లు రూపాన్ని మార్చుకుని విలన్ క్యారెక్టర్స్ కు ది బెస్ట్ ఛాయిస్ గా మారిన ఈ యంగ్ విలన్..

Charan Deep Photo gallery

 

ప్రస్తుతం 'చుట్టాలబ్బాయి'లో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ్ లో విశాల్ తో 'కత్తి సాండై'తో పాటు 'శరభ', 'వీర'లో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే లారెన్స్ సినిమా 'మొట్ట శివ కెట్ట శివ'లో ఈ స్టైలిష్ విలన్ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. అలాగే సునీల్- వీరు పోట్ల కాంబినేషన్ మూవీలోనూ ఈ చాకులాంటి కుర్రాడే విలన్. ఇక రిలీజ్ కు రెడీ అవుతున్న 'అంతం' మూవీలో హీరో తరహా క్యారెక్టర్ లో సందడి చేసేందుకు వస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న చరణ్ దీప్ కు.. ఈ ఏడాది మరింతగా కలసి రావాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే టు సౌత్ ఇండియా స్టైలిష్ విలన్ చరణ్ దీప్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved