pizza
Charuseela regular shooting from 16 September
You are at idlebrain.com > news today >
Follow Us

15 September 2015

రష్మీ టైటిల్ పాత్రలో రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ‘చారుశీల’

రష్మీ టైటిల్ పాత్రలో జ్యోత్న్స ఫిలింస్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘చారుశీల’. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకత్వంలో శ్రీమతి సుబ్బిరెడ్డి జయశ్రీ అప్పారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, జశ్వంత్, డా.బ్రహ్మానందం ముఖ్యపాత్రధారులుగా నటిస్తున్నారు. థ్రిల్లర్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఇటీవల బ్రహ్మానందం తనయుడు, ప్రముఖ యువ కథానాయకుడు గౌతమ్ క్లాప్ తో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం రేపటి(సెప్టెంబర్ 16) నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకుంటుంది. సింగిల్ షెడ్యూల్ లో హైదరాబాద్, అరకు పరిసర ప్రాంతాల్లో సినిమాని పూర్తి చేస్తాం. ఇది రష్మీకి మంచి బ్రేక్ ఇచ్చే చిత్రమవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంట్ మూవీగా నిలుస్తుందని చిత్ర నిర్మాత శ్రీమతి సుబ్బిరెడ్డి జయశ్రీ అప్పారావు తెలియజేశారు.

రష్మీ, రాజీవ్ కనకాల, జశ్వంత్, డా.బ్రహ్మానందం ముఖ్యపాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కుమార్ మల్లారపు, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం: సుమన్ జూపూడి, కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత: శ్రీమతి సుబ్బిరెడ్డి జయశ్రీ అప్పారావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ ఉయ్యూరు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved