pizza
Chase movie shooting completed
You are at idlebrain.com > news today >
Follow Us

19 September 2014
Hyderabad

షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న "చేజ్"(CHASE)

పినాకిన్ ఆర్ట్స్ బ్యానర్ పై, శ్రీమతి పద్మలత సమర్పణలో, రామ్ దివ్యేష్, స్పందన అల్లూరి, ప్రధాన పాత్రధారులుగా, మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"చేజ్"(CHASE). షూటింగ్ కార్యక్రమలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.గతంలొ మోహన్ నిమ్మకాయల నిర్మించిన హాలీవుడ్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిలిం"SOMETIMES IN LIFE" సినిమా కు కో- ప్రొడ్యూసర్, "SOMETIMES IN LIFE" యూనిట్ డైరెక్టర్ గా ఇప్పుడు తన స్వంత భాష తెలుగు లో " చేజ్"(CHASE) సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత మోహన్ నిమ్మకాయల మాట్లాడుతూ; "చేజ్" సినిమాని మొత్తం అమెరికాలోని అందమైన ప్రదేశాలలో చిత్రికరించటం జరిగింది. సినిమాలొని యక్షన్ సన్నివేశాలను

ప్రముఖ హాలివుడ్ స్టంట్ మాస్టర్ టాం హెన్రి నేతృత్వంలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ద్వారా కధానాయకుడుగా పరిచయమౌతున్న రామ్ దివ్యేష్ మంచి నటనను కనపరిచాడు. సంగీత దర్శకుడు శంకర్ తమిరి సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలిజ్ చేసేంధుకు సన్నాహాలు చేస్తున్నాము.

ఇంకా ఈ చిత్రంలో నిశాంత్, లోకనాథ్ పరవస్తు, హరి రామ్, పిల్ అవ్డా, టాం హెన్రి,Chris గిల్మోరే తదితరులు ముఖ్యపాత్రలను పొషించారు త్వరలో ఈ చిత్రాన్ని ప్రెక్షకులముందుకు తిసుకువస్తాము అని అన్నారు

సంగితం; శంకర్ తమిరి, గేయ రచయిత; వేణు జయరాం, కథ: రాజేష్ జగన్నాధం, సినిమాటోగ్రాఫర్: ట్రాయ్ బకేవేల్ల్,డాన్సు;అనిల్ హరి, రేని జాయ్, రోషని,స్టంట్స్: టామ్ హెన్రీ, సమర్పణ: పద్మలత, నిర్మాత- దర్శకత్వం: మోహన్ నిమ్మకాయల.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved